రూ. 3వేలకే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్
స్వైప్ టెక్నాలజీస్ తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎలైట్ స్టార్'ను విడుదల చేసింది. రూ .3,333 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు లభ్యమవుతోంది.
జియో రాకతో ఇప్పుడు 4జీ ఫోన్లు రంగ ప్రవేశం చేస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలకే 4జీ ఫోన్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వైప్ టెక్నాలజీస్ తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎలైట్ స్టార్'ను విడుదల చేసింది.
యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల అటాక్..ఆ మూడే టార్గెట్

రూ .3,333 ధరకు ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు లభ్యమవుతోంది. 4జీ వోల్ట్ సపోర్ట్ తో అత్యంత తక్కువ ధరలో లభించే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

ఫీచర్ల విషయానికొస్తే 4 ఇంచ్ డిస్ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ర్యామ్ విషయానికొస్తే 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కలిగి ఉంది.
అమెజాన్ సంచలనం..13 నిమిషాల్లోనే సరుకు డెలివరీ

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్ ఉంటాయి. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీ షూట్ తీయవచ్చు. 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.0తో పాటు 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








