ఎయిర్‌టెల్‌కి జియో షాక్

Written By:

ఎయిర్‌టెల్‌కి జియో షాక్ తగిలింది. దేశంలో సబ్ స్క్రైబర్ల పరంగా నంబర్ వన్ స్టానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలపై జియో ప్రభావం భారీ స్థాయిలో పడింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం గత ఏడాది క్యు3లో 1108.10 కోట్ల రూపాయల నుంచి ఈ త్రైమాసికంలో 503.70 కోట్లకు పడిపోయింది. ఇది నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి సమానం.

బిఎస్ఎన్ఎల్ రిప్లబిక్ డే ఆఫర్

ఎయిర్‌టెల్‌కి జియో షాక్

కొత్తగా ప్రవేశించిన ఆపరేటర్‌ అనుసరించిన పోటీ నిరోధక ధరల విధానం తమను దెబ్బ తీసిందని కంపెనీ సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ప్రస్తుతం వారి కాల్‌ టెర్మినేషన్‌ 14 పైసలు తమ చార్జీల కన్నా చాలా తక్కువ అని, ఇది నిమిషాల టెర్మినేషన్‌లో సునామీ సృష్టించిందని ఆయన చెప్పారు.

షియోమికి దిమ్మతిరిగే షాక్..

ఎయిర్‌టెల్‌కి జియో షాక్

వారి అనుచిత వ్యాపార ధోరణుల వల్ల మొత్తం పరిశ్రమలో అన్ని కంపెనీల ఆదాయాలు భారీగా క్షీణించడంతో పాటు మార్జిన్లు కుంచించుకుపోయాయని, మొత్తం టెలికాం రంగం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు

English summary
Predatory pricing of new entrants like Reliance Jio is hurting telcos: Airtel read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot