బిఎస్ఎన్ఎల్ రిప్లబిక్ డే ఆఫర్

Written By:

ప్రైవేట్‌ ఆపరేటర్ల పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ .. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ప్రవేశపెడుతోంది. తమ నెట్‌వర్క్‌లో అపరిమిత ఉచిత కాల్స్‌ సదుపాయం కల్పించే ప్లాన్‌ కూడా ఇందులో ఉంది. ఈ ప్లాన్ లో మీరు రూ. 26తో రీఛార్జ్ చేసుకుంటే 26 గంటలపాటు మాట్లాడుకోవచ్చు.

షియోమికి దిమ్మతిరిగే షాక్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

26 గంటలపాటు ఉచితం

ఎస్‌టీవీ 26 కూపన్ రీచార్జ్ ద్వారా 26 గంటలపాటు ఉచితంగా ఏదేని నెట్‌వర్క్‌కు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

25 నుంచి 31 వరకు

ఈ కూపన్ ఈనెల 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

కాంబో 2601 ఆఫర్‌లో

మరో రెండు ఆఫర్లలో ఒకటి కాంబో 2601 .కాంబో 2601 ఆఫర్‌లో భాగంగా రీచార్జి విలువకు 1.5 రెట్ల టాక్‌టైం లభిస్తుంది.

రూ.2600 విలువైన టాక్‌టైం

ఇందులో రూ.2600 విలువైన టాక్‌టైం మెయిన్ అకౌంట్లోకి, మరో రూ.1300 విలువైన టాక్‌టైం సెకండరీ అకౌంట్లోకి జమవుతుంది. సెకండరీ టాక్‌టైం కాలపరిమితి మూడు నెలల్లో ముగుస్తుంది.

రూ.6801 తో రీఛార్జ్

మరొకటి కాంబో 6801.దీని ద్వారా 2 రెట్ల టాక్‌టైం లభిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది. రూ.6801 తో రీఛార్జ్ చేయడం ద్వారా రూ. 13602 టాక్ టైం లభిస్తుంది.

మార్చ్‌ ఆఖరు దాకా

హై-ఎండ్‌ సెగ్మెంట్‌పై దృష్టితో ప్రవేశపెడుతున్న మిగతా రెండు ప్లాన్స్‌.. మార్చ్‌ ఆఖరు దాకా ఉంటాయని శ్రీవాస్తవ వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to offer 3 new prepaid plans, including free calls read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot