షియోమికి దిమ్మతిరిగే షాక్..

Written By:

స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమికి గట్టిషాక్ తగిలింది. చైనా ఆపిల్ గా పేరుగాంచిన షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా అకస్మాత్తుగా రిజైన్ చేయడం కలకలం రేపింది. షియోని తొలి ఫోన్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. లేటెస్ట్ గా వచ్చిన రెడ్ మి నోట్ 4ని కూడా అట్టహాసంగా ఆవిష్కరించి కంపెనీకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజీనామా వార్తతో షియోమి ఒక్కసారిగా షాక్ తింది.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్, మొబైల్స్‌పై టాప్ డీల్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యుగో ఆకస్మిక రాజీనామా

నిన్నగాక మొన్న (జనవరి19) తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 4 ను అట్టహాసంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్న హ్యుగో ఆకస్మిక రాజీనామా మార్కెట్ వర్గాలను విస్మయ పర్చింది.

మూడున్నర సంవత్సరాల జైత్రయాత్రకు ముగింపు

ఫిబ్రవరిలో చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ (నూతన సంవత్సరం) తరువాత సిలికాన్ వ్యాలీలో కొత్త సాహసయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఇదే సమయంలో కంపెనీలో మూడున్నర సంవత్సరాల జైత్రయాత్రకు ముగింపు పలకడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సిలికాన్ వ్యాలీ to షియోమి

మై కంఫర్ట్ జోన్ సిలికాన్ వ్యాలీనుంచి 6,500 మైళ్లు దూరంలోని షియోమికి తరలి వెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ అద్భుతమైన ఈ ప్రయాణంలోసాధించిన విజయాలకు తనకు గర్వంగా ఉందన్నారు.

తొలి తరం ఫోన్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత

అలాగే షియోమి తొలి తరం ఫోన్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తన జీవనశైలి కారణంగా ఆరోగ్యం విషయంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కుటుంబ సభ్యుల కోరిక మేరకు కుటుంబానికి అత్యంత సమీపంలో ఉండే సిలికాన్ వ్యాలీలో ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

2013 ఆగస్టులో

త్వరలోనే తాను బీజింగ్ నుంచి తన సొంత సిలికాన్ వ్యాలీ బెంగుళూరుకు వెళ్లనున్నట్టు తెలిపారు. గూగుల్ లో పనిచేస్తున్న ఆయన 2013 ఆగస్టులో షియోమిలో చేరారు. ఫేస్‌బుక్ ద్వారా తాను పదవి నుంచి వైదొలగుతున్నట్టు హ్యుగో ప్రకటించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ALERT: Hugo Barra, Global VP At Chinese Tech Giant Xiaomi, Has Resigned read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot