ఫ్లిప్ కార్ట్ లొ మొదలయిన Realme3pro సేల్స్
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రియల్ మి 3 ప్రో గత సోమవారం ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేయబడింది
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రియల్ మి 3 ప్రో గత సోమవారం ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేయబడింది. రియల్ మి 3 ప్రో అనేది Oppo స్పిన్-ఆఫ్ బ్రాండ్ యొక్క ప్రధాన స్మార్ట్ ఫోన్ .గత నెలలో మొదటిసారి Realme 3 విడుదల ప్రకటించబడింది.

ఇండియన్ మార్కెట్ లోకి రియల్ మి3ప్రో గత సోమవారం రిలీజ్ అయింది.రెడ్మి నోట్ 7 ప్రో మరియు శామ్సంగ్ గెలాక్సీ M30 మాదిరి రియల్ మి3ప్రో కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉంది.వినియోగదారులని ఆకర్షించడానికి రియల్ మి 3 ప్రో యొక్క ముఖ్యమైన లక్షణాలు 6.3-inch పూర్తి-HD + డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 710Soc, మరియు 16-మెగాపిక్సెల్ సెన్సర్ తొ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి.

వేరియంట్
ఇండియాలో రియల్మీ 3 ప్రో 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.13,999, దాని 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.16.999గా నిర్ణయించారు. ఇది కార్బన్ గ్రే, నైట్రో బ్లూ, మరియు మెరుపు పర్పుల్ రంగులలో వస్తుంది. ఇది ఏప్రిల్ 29 నుంచి రియల్ మి ఆన్లైన్ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా దేశంలో విక్రయించబడతాయి.

రియల్ మి ఆన్లైన్ స్టోర్ ఆఫర్స్:
ఆఫర్లను ఇవ్వడంలో ముందు ఉండే ఈ సంస్థ ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ ని ప్రకటించింది.సంస్థ యొక్క ఆన్లైన్ స్టోర్ ద్వారా నేడు రియల్3 ప్రోని కొనుగోలు చేసిన మొదటి 1,000 మంది వినియోగదారులు రియల్ బీడ్స్ నీ ఉచితంగా పొందవచ్చు. అదనంగా రియల్ మి ఆన్లైన్ స్టోర్లొ కొనుగోలుదారులు Mobikwik ద్వారా చెల్లింపులో 15 శాతం సూపర్ క్యాష్ బ్యాక్ (రూ .1,500 వరకు)పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్:
ఫ్లిప్ కార్ట్ ద్వారా రియల్ మి3ప్రోని కొనుగోలు చేసిన వారికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మీద రూ.1000 డిస్కౌంట్ కూడా ఉంటుంది.అంతేకాకుండా ఫ్లిప్ కార్ట్ లొ EMI ద్వారా కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఆరు నెలల వరకు EMI కాస్ట్ ఉండదు.

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4045mAh
ధర ----- రూ. 13,999/రూ.16,999


Click it and Unblock the Notifications








