Home
News

మొదటిసారిగా మంచి ఆఫర్లతో ఇండియాలో మొదలైన రియల్‌మి 5 ప్రో అమ్మకాలు

రియల్‌మి సంస్థ ఇటీవల భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తున్న రియల్‌మి సంస్థ యొక్క మొదటి రెండు ఫోన్‌లు రియల్‌మి మరియు రియల్‌మి 5 ప్రో. ఇప్పటివరకు రియల్‌మి 5 మాత్రమే ఫ్లాష్ అమ్మకాలకు వెళ్ళింది. ఇప్పుడు అందరు ఎదురుచూస్తున్న రియల్‌మి 5 ప్రో కూడా ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు మొదటిసారిగా అమ్మకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

లభ్యత

రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు నుండి రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మి బడ్స్ 2ను కూడా రియల్‌మి.కామ్ ద్వారా అమ్మకాలు మొదలుకానున్నాయి.

ధర వివరాలు

రియల్‌మి 5 ప్రో యొక్క బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 13,999 రూపాయలు. అలాగే 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 14,999 రూపాయలు. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 16,999 రూపాయలు.

రియల్‌మి బడ్స్ 2 ధర

రియల్‌మి సంస్థ ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు రియల్‌మి బడ్స్ 2 లను కూడా విడుదల చేస్తోంది. ఇవి మొదటిసారిగా రియల్‌మి.కామ్ లో అమ్మకాలు జరగనున్నాయి. వీటి ధర 599 రూపాయలు.

ఆఫర్లు

రియల్‌మి 5 ప్రో యొక్క అమ్మకపు ఆఫర్ల విషయానికొస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ మొబైల్ పై 750 రూపాయల తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో డెబిట్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా 250 రూపాయల తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా కొనుగోలుదారులు 99 రూపాయల ధరతో పూర్తి మొబైల్ ప్రొటెక్షన్ ను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ మీద 6 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికను పొందవచ్చు. ఇంకా కస్టమర్లు Paytm ద్వారా రియల్‌మి ఫోన్ కొనుగోలుపై 20,000 రూపాయల వరకు Paytm ఫస్ట్ ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా 2,000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఇది Paytm UPI ని ఉపయోగించి రియల్‌మి.కామ్‌లో పొందవచ్చు. చివరగా రిలయన్స్ జియో యొక్క 7,000 రూపాయల విలువైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు .

స్పెసిఫికేషన్స్

రియల్‌మి 5 ప్రో 6.3-అంగుళాల ఫుల్ HD + స్క్రీన్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. దీని యొక్క ప్యానెల్ 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఈ పరికరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC తో నిర్మించబడింది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో బ్యాకప్ చేయబడింది. అంతేకాకుండా రియల్‌మి 5 ప్రో స్ప్లాష్-రెసిస్టెంట్ డిజైన్‌ను కూడా అందిస్తుంది. అంటే ఇది ప్రమాదవశాత్తు నీటి చినుకులు లేదా తేలికపాటి వర్షాలను నిర్వహించగలదు.

ఫీచర్స్

ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ కోసం మద్దతును కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో కలర్ ఓఎస్ స్కిన్‌తో ఫోన్ షిప్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. మూడవ మరియు నాల్గవ కెమెరాలు డీప్ మరియు మాక్రో మోడ్ కోసం 2-మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది. వీటన్నిటిని నిర్వహించడానికి రియల్‌మి 5 ప్రో 4,035 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme 5 Pro, Realme Buds 2 First Sale Start Today in India via Flipkart : Price, Best Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X