Realme C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం!!! ఆఫర్స్ అదుర్స్ ...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఈ నెల ప్రారంభంలో రియల్‌మి C-సిరీస్‌లో భాగంగా రియల్‌మిC11 విడుదల చేసారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ యొక్క రెండవ అమ్మకం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా మొదలుకానున్నది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ మరియు 32GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి C11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదల అయింది. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 7,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

Also Read: Vivo V19 స్మార్ట్‌ఫోన్‌ ధరల మీద రూ.3,000 వరకు భారీ తగ్గింపు...Also Read: Vivo V19 స్మార్ట్‌ఫోన్‌ ధరల మీద రూ.3,000 వరకు భారీ తగ్గింపు...

రియల్‌మి C11 సేల్స్ ఆఫర్స్

రియల్‌మి C11 సేల్స్ ఆఫర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ మీద ఆసక్తిగల వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని ఆఫర్లు ఉన్నాయి. వినియోగదారులు SBI క్రెడిట్ కార్డ్ యొక్క EMI లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రుపే డెబిట్ కార్డు ఉపయోగించి వారి మొదటి ప్రీపెయిడ్ లావాదేవీపై రూ.30 ప్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో ఐదు శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.

రియల్‌మి C11 ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్

రియల్‌మి C11 ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌కు మద్దతు ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది. రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ యొక్క బ్యాటరీ ఒక్క ఛార్జ్ మీద 40 రోజుల స్టాండ్‌బైతో రేట్ చేయబడి ఉంది.

రియల్‌మి C11 IPS LCD డిస్‌ప్లే

రియల్‌మి C11 IPS LCD డిస్‌ప్లే

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉండి వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ మరియు 1600 x 720 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి C11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది పిక్సెల్ 4 సిరీస్ మాదిరిగానే రూపొందించబడింది. ఇందులో గల మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇది AI బ్యూటీ మోడ్ కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Realme C11 Budget Smartphone Second Sale in India Starts at 12PM Today

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X