Home
News

Realme Days Sale: మళ్ళీ మళ్ళీ దొరకని గొప్ప తగ్గింపు ఆఫర్స్..

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యొక్క సొంత వెబ్ సైట్ లో రియల్‌మి డేస్ సేల్స్ ను ఇప్పుడు మళ్లీ తిరిగి తీసుకువస్తోంది. ఈ అమ్మకంలో భాగంగా రియల్‌మి సంస్థ యొక్క అనేక ఫోన్ల మీద డిస్కౌంట్లను అందిస్తోంది. రియల్‌మి యొక్క సేల్స్ మార్చి 19 నుండి మార్చి 22 వరకు రియల్‌మి యొక్క భాగస్వామి వెబ్‌సైట్లలో ప్రారంభమవుతుంది.

రియల్‌మి

ఈ సేల్స్ సమయంలో రియల్‌మి ఫోన్‌లను కొనుగోలు చేయదలచిన వారికి ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుల మీద 10 శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా EMI లావాదేవీల మీద తమ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు అని రియల్‌మి సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బంప్ అప్ ప్రీక్సో' ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ సమయంలో వినియోగదారులు తమ పాత ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు.

రియల్‌మి 6 మరియు రియల్‌మి 6 ప్రో

రియల్‌మి 6 మరియు రియల్‌మి 6 ప్రో

రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు టాటాక్లిక్‌లలో రియల్‌మి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మీరు రియల్‌మి6 మరియు రియల్‌మి 6 ప్రో యొక్క ఏదైనా వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ నుండి ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా షాపింగ్ చేస్తే మీరు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి 6 ఫోన్ యొక్క ధర రూ. 12,999 ఉండగా, రియల్‌మి 6 ప్రో యొక్క ధర రూ. 15,999 గా ఉంది.

రియల్‌మి 5

రియల్‌మి 5

రియల్‌మి 5 యొక్క మూడు వేరియంట్‌లలో 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ. 8,499, 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ను రూ. 9,499, మరియు 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ను 10,499 ధర వద్ద ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు .

 

రియల్‌మి 5 ప్రో

రియల్‌మి 5 ప్రో

రియల్‌మి 5 ప్రో యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మీద అమ్మకం సమయంలో రూ.1,000 తగ్గింపుతో ఇప్పుడు కేవలం 11,999 రూపాయల ధర వద్ద లభిస్తుంది . ఫోన్ యొక్క అసలు ధర రూ. 12,999. అలాగే 6 జీబీ + 64 జీబీ, 8 జీబీ + 128 జీబీ వేరియంట్ల మీద రియల్‌మి వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా రూ.1,000 తో పాటు అదనపు ప్రీపెయిడ్ ఆఫర్‌లలో రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మి X మరియు రియల్‌మి XT

రియల్‌మి X మరియు రియల్‌మి XT

రియల్‌మిX యొక్క 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్‌లు రూ. 2,000 ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో ఇప్పుడు కేవలం రూ.14,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు రియల్‌మి XT యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఈ సేల్స్ సమయంలో 14,999 రూపాయల వద్ద మరియు 6 జీబీ + 64 జీబీ, 8 జీబీ + 128 జీబీ మోడళ్లు కూడా రూ. 1,000 తగ్గింపుతో పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Days Sale 2020: Discounts and offers on Realme Mobiles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X