Realme 6 Pro sale: మొదటి అమ్మకంలో అదిరిపోయే ఆఫర్స్...

|

రియల్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో గత వారం విడుదల చేసారు. ఇప్పటికే రియల్‌మి 6 మరియు రియల్‌మి బ్యాండ్ యొక్క అమ్మకాలను మొదలుపెట్టింది. ఇప్పుడు మొదటిసారిగా రియల్‌మి 6 ప్రోను ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అమ్మకానికి ఉంచింది.

రియల్‌మి 6 ప్రో
 

కొనుగోలుదారులు దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో రియల్‌మి 6 ప్రో యొక్క ధరను రూ.16,999 గా నిర్ణయించబడింది. ఈ పరికరంతో, మీరు 30W ఛార్జర్, 90Hz డిస్ప్లే, మీడియాటెక్ G90T SoC, క్వాడ్-కెమెరా సెటప్ మరియు మరిన్ని పొందుతారు. రియల్‌మే 6 ప్రో అమ్మకపు ఆఫర్‌లు, ఇండియా ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Realme Band సేల్స్ : మళ్ళీ దొరకని ఆఫర్స్ త్వరపడండి...

ఇన్ఫినిక్స్ S5 ప్రో

ఇన్ఫినిక్స్ S5 ప్రో

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు పాప్-అప్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉండి చౌకైన ధరను కలిగిన ఇన్ఫినిక్స్ S5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు కూడా ఈ రోజు మొదటిసారిగా మొదలుకానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.9,999 ప్రారంభ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.

Infinix S5 Pro: సరసమైన ధరలో పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్

రియల్‌మి 6 ప్రో ధరల వివరాలు

రియల్‌మి 6 ప్రో ధరల వివరాలు

రియల్‌మి 6 సిరీస్ రూ.12,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 6 ప్రో ఇండియాలో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.16,999 కాగా. 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ధర రూ.17,999 కాగా, టాప్-ఎండ్-మోడల్ 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.18,999.

రియల్‌మి 6 ప్రో సేల్స్ ఆఫర్స్
 

రియల్‌మి 6 ప్రో సేల్స్ ఆఫర్స్

రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ యొక్క వెబ్ సైట్ లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నది. ఈ అమ్మకపు ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క EMI లావాదేవీలను ఉపయోగించే వినియోగదారులకు రూ.750ల తగ్గింపును అందిస్తుంది. నెలకు రూ.1,084 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను కూడా వినియోగదారులు పొందవచ్చు. రియల్‌మి.కామ్ సైట్ రియల్‌మి 6 కొనుగోలు మీద తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను మార్పిడి చేసుకోవటానికి క్యాషిఫై ద్వారా ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులపై వినియోగదారులు రూ.1,000 మినహాయింపు పొందవచ్చు.

రియల్‌మి6 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి6 ప్రో స్పెసిఫికేషన్స్

రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.5-అంగుళాల డిస్‌ప్లే ఫుల్ HD + రిజల్యూషన్‌ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,300 అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశానికి చెందిన NavIC అనే GPS సిస్టమ్‌ మద్దతుతో వస్తుంది.

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

రియల్‌మి 6 ప్రో కెమెరా సెటప్

రియల్‌మి 6 ప్రో కెమెరా సెటప్

రియల్‌మి6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్‌ను కలిగి ఉంది.ఈ సెటప్‌లోని రెండవ కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ లు వరుసగా ఉన్నాయి. ఇది 20x హైబ్రిడ్ జూమ్‌కు మద్దతును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన నైట్స్కేప్ 3.0 మోడ్, ట్రైపోడ్ మోడ్ తో వస్తాయి. ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఇవి 103 డిగ్రీ కోణంలో సెల్ఫీలను తీయడానికి కూడా అనుమతిని ఇస్తుంది.

మొబైల్ రీఛార్జి:గూగుల్ సెర్చ్ ద్వారా కూడా చేసుకోవచ్చు.ఎలాగో తెలుసుకోండి

రియల్‌మి 6 ప్రో కనెక్టివిటీ

రియల్‌మి 6 ప్రో కనెక్టివిటీ

రియల్‌మి 6 ప్రో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. భద్రత కోసం రియల్‌మి ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి యుఐతో రన్ చేయబడుతుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, బ్లూటూత్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, సామీప్య సెన్సార్ మరియు దిక్సూచి / మాగ్నెటోమీటర్ వంటి సెన్సార్లను కలిగి ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme 6 Pro, Infinix S5 Pro First Sale Starts Today in India at 12PM via Flipkart: Price, Specifications, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X