Realme Narzo 10A Sale : గొప్ప క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమ్మకానికి బడ్జెట్‌ ఫోన్‌!!! త్వరపడండి...

|

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో అతి తక్కువ కాలంలో మంచి పేరును సంపాదించిన సంస్థలలో రియల్‌మి ఒకటి. ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకోవడానికి గత నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్‌మి నార్జో 10A ను లాంచ్ చేసింది.

రియల్‌మి నార్జో 10A బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

రియల్‌మి నార్జో 10A బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

రియల్‌మి నార్జో 10A బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో మొదలుకానున్నాయి. అంతేకాకుండా దీనిని ఇప్పుడు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి నార్జో 10A బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరను కలిగి ఉండి అద్భుతమైన మీడియాటెక్ హెలియో G70 SOC వంటి అద్బుతమైన గేమింగ్ ఫీచర్లతో వస్తుంది.

రియల్‌మి నార్జో 10A ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10A ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ ను కేవలం ఒకే ఒక 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్‌లో విడుదల అయిన ఈ ఫోన్ యొక్క ధర సుమారు 8,499 రూపాయలు. ఈ ఫోన్ ను కొనుగోలుదారులు సో బ్లూ మరియు సో వైట్ వంటి కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. Also Read:రోజుకు 2GB డేటాను అందిస్తున్న Airtel, Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే....

రియల్‌మి నార్జో 10A సేల్స్ ఆఫర్స్
 

రియల్‌మి నార్జో 10A సేల్స్ ఆఫర్స్

రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్ కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌లోని ఆఫర్‌ల విషయానికి వస్తే ఏదైనా రూపే డెబిట్ కార్డు యొక్క మొదటి ప్రీపెయిడ్ లావాదేవీ మీద 30 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు మీద కూడా 5 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే 3 నెలల నుండి 12 నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపికల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి.కామ్ లో మొబిక్విక్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.500 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

రియల్‌మి నార్జో 10A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 10A స్పెసిఫికేషన్స్

రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే హెచ్‌డి + రిజల్యూషన్ తో 720x1600 పిక్సెల్స్ పరిమాణంతో మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. అలాగే ఇది "మినీ-డ్రాప్" నాచ్ స్టైల్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. దీని యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC మరియు ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో రన్ అవుతుంది. Tata Sky vs Airtel Digital TV vs Dish TV: సెట్-టాప్ బాక్స్‌లలో బెస్ట్ ఇదే!!!

రియల్‌మి నార్జో 10A కెమెరా సెటప్‌

రియల్‌మి నార్జో 10A కెమెరా సెటప్‌

రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో f / 1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందువైపు ఎఫ్ / 2.0 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 30fps ఫ్రేమ్ రేట్ వద్ద HD (720p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ ఫుల్ -హెచ్‌డి (1080p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

రియల్‌మి నార్జో 10A కనెక్టివిటీ ఎంపికలు

రియల్‌మి నార్జో 10A కనెక్టివిటీ ఎంపికలు

రియల్‌మి నార్జో 10A ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G LTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క సెన్సార్ల విషయంలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 250GB వరకు విస్తరించవచ్చు.

Best Mobiles in India

English summary
Realme Narzo 10A Sale Start Today at 12PM Via Flipkart: Price, Discounts and more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X