అద్భుతమైన ఆఫర్లతో అమ్మకానికి రియల్‌మి స్మార్ట్ టీవీ, నార్జో 10 స్మార్ట్ ఫోన్

|

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేవలం పరిమిత కాలంలో మాత్రమే అన్ని సంస్థలు తమ యొక్క అన్ని రకాల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ప్రముఖ రియల్‌మి సంస్థ రియల్‌మి నార్జో 10 మరియు రియల్‌మి స్మార్ట్ టీవీ యొక్క రెండు వేరియంట్లను అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రియల్‌మి అమ్మకాలు
 

రియల్‌మి అమ్మకాలు

రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G80 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అవుతూ 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే రియల్‌మి స్మార్ట్ టివి క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండి డాల్బీ ఆడియో క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి ఇది 24W అవుట్పుట్‌ సౌండ్ ను అందిస్తుంది. 32-అంగుళాల మరియు 43-అంగుళాల రెండు స్క్రీన్ పరిమాణాలలో లభించే స్మార్ట్ టీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 10 ధర మరియు సేల్ వివరాలు

రియల్‌మి నార్జో 10 ధర మరియు సేల్ వివరాలు

రియల్‌మి నార్జో 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వంటి ఒకే ఒక ఎంపికలో బ్లూ, గ్రీన్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రూ.11,999 ధర వద్ద లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని సేల్స్ ఆఫర్‌లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం వరకు తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే దీనిని నెలకు రూ.1,334 నుండి మొదలయ్యే EMI ఎంపికల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి టీవీల ధర వివరాలు

రియల్‌మి టీవీల ధర వివరాలు

రియల్‌మి స్మార్ట్ టీవీలను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 ధర కాగా 43 అంగుళాల డిస్‌ప్లే గల టాప్ టైర్డ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999.

రియల్‌మి టీవీల సేల్ ఆఫర్స్
 

రియల్‌మి టీవీల సేల్ ఆఫర్స్

రియల్‌మి యొక్క స్మార్ట్ టీవీ కూడా ఇండియాలో రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లోని అమ్మకపు ఆఫర్‌లలో HSBC క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. 32-అంగుళాల టీవీ కొనుగోలుకు నెలకు రూ.1,445 నో-కాస్ట్ EMI ఎంపికలు , మరియు 43-అంగుళాల టీవీ మీద నెలకు రూ.2,445 నో-కాస్ట్ EMI ఆప్షన్లు లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ రెండూ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌.కామ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు విక్రయించబడతాయి.

రియల్‌మి టీవీ స్పెసిఫికేషన్స్

రియల్‌మి టీవీ స్పెసిఫికేషన్స్

రియల్‌మి స్మార్ట్ టీవీ ఇండియాలో 32 అంగుళాలు మరియు 43 అంగుళాల వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 32 అంగుళాల వేరియంట్ 768x1,366 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉండగా, 43 అంగుళాల మోడల్ 1,080x1,920 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. రెండు వేరియంట్లు ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉన్నాయి. ఇది Google Play కి యాక్సిస్ ను ఇచ్చి Android TV 9 పై ద్వారా రన్ అవుతుంది.

రియల్‌మి టీవీ ఫీచర్స్

రియల్‌మి టీవీ ఫీచర్స్

రియల్‌మి టీవీల్లో స్టాండర్డ్, Vivid, గేమ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ తో సహా ఏడు రకాల డిస్ప్లే మోడ్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి టీవీలు 178 డిగ్రీల "సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్" ఫీచర్ ను కలిగివున్నాయి. అలాగే ఇది మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా 64 బిట్ క్వాడ్ కోర్ CPU మరియు మాలి -470 MP3 GPUలతో పనిచేస్తాయి. అలాగే ఇది 8GB ROM మరియు 1GB ర్యామ్ తో కూడా జతచేయబడి ఉన్నాయి.

రియల్‌మి నార్జో 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి 10 ఫోన్ 720x1600 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది హెచ్‌డి + రిజల్యూషన్, 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు "మినీ-డ్రాప్" నాచ్ స్టైల్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. రియల్‌మి నార్జో 10 సింపుల్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో పనిచేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Smart TV, Realme Narzo 10 Sale Start Today on India via Flipkart and Realme.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X