సరసమైన ధరలో ఈ రోజు అమ్మకానికి రియల్‌మి టీవీ!!! ఆఫర్స్ అదుర్స్...
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మొదటిసారిగా ఇండియాలో తన స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ టీవీని వినియోగదారులు కొనుగోలు చేయడానికి రియల్‌మి సంస్థ మరోసారి దీనిని అమ్మకానికి ఉంచింది.

రియల్‌మి టీవీ
ఈ అమ్మకం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క సొంత వెబ్‌సైట్‌లో జరుగుతుంది. ఈ రెండు ఆన్‌లైన్ పోర్టల్‌లలో రియల్‌మి టీవీ యొక్క 32-అంగుళాల మరియు 43-అంగుళాల మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ సరసమైన స్మార్ట్ టీవీ షియోమి Mi టివి సిరీస్, ఐఎఫ్ఫాల్కాన్, టిసిఎల్, థామోసన్ వంటి మరిన్ని బ్రాండ్లతో మార్కెట్లో పోటీపడుతున్నది. Also Read:Flipkart TV Days Sale: బ్రహ్మాడమైన ఆఫర్లతో టీవీల కొనుగోలుకు సరైన సమయం.....

రియల్‌మి టీవీల ధరల వివరాలు
రియల్‌మి సంస్థ విడుదల చేసిన రెండు వేరియంట్‌ల స్మార్ట్ టీవీలలో 32 అంగుళాల వేరియంట్ యొక్క ధర రూ.12,999 ధర కాగా 43 అంగుళాల టాప్ టైర్డ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999. ఈ టీవీలను కొన్నవారికి సంస్థ ఆరు నెలల యూట్యూబ్ ప్రీమియం ట్రయల్‌ను ఉచితంగా అందిస్తున్నది. అలాగే ఒక సంవత్సరం యాక్సిస్ వారంటీతో పాటు ప్యానెల్స్‌కు ఒక సంవత్సరం అదనపు వారంటీని కూడా సంస్థ అందిస్తుంది. Also Read:Reliance Jio: అధిక డేటా కోసం సరైన వోచర్ ప్యాక్‌లు ఇవే...

రియల్‌మి టీవీ డిస్‌ప్లే ఫీచర్స్
రియల్‌మి టీవీలు 32-అంగుళాల మరియు 43-అంగుళాల వేరువేరు డిస్‌ప్లే పరిమాణాలలో వస్తుంది. 32-అంగుళాల టీవీ 178 డిగ్రీల వీక్షణతో HD రెడీ (720p) ప్యానెల్ ను మరియు 43 అంగుళాల టీవీ ఫుల్ హెచ్‌డీ ప్యానెల్ను కలిగి ఉంది. ఇది అంతర్నిర్మిత స్పోర్ట్ క్రోమ్ కాస్ట్ మరియు HDR10 వీడియో డీకోడింగ్ టెక్నాలజీను కలిగి ఉంటుంది. ఇది ఇది 400 నిట్స్ డిస్ప్లే గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉండి గ్రాఫిక్ స్వచ్ఛతతో చిత్ర నాణ్యత కోసం మరొక అధిక-నాణ్యత ఆకృతి అయిన HLG ఫీచర్ ను కలిగి ఉంది. Also Read: షియోమి Mi TV 4X 50 స్మార్ట్‌టీవీ రివ్యూ

రియల్‌మి స్మార్ట్ టీవీ డిజైన్
రియల్‌మి స్మార్ట్ టీవీలలో మీడియాటెక్ యొక్క శక్తివంతమైన క్వాడ్-కోర్ 64-బిట్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది ఆర్కిటెక్చర్ మాలి -470 MP3 GPU తో పాటు ARM కార్టెక్స్ A53 1.1GHz CPU ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2133MHz ర్యామ్ వద్ద క్లాక్ చేయబడింది. ఇది ఇతర టీవీలలో ఉపయోగించే సాధారణ 1600MHz ర్యామ్ కంటే వేగంగా ఉంటుంది. ఇది 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. ఇందులో "శక్తివంతమైన చిప్‌సెట్"లను కలిగి ఉండి ఇవి HDR10 మరియు HLG వీడియోలకు మద్దతును అందిస్తుంది. రియల్‌మి టీవీలు డాల్బీ ఆడియో మద్దతుతో 24W క్వాడ్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండడంతో పాటుగా రెండు ట్వీటర్లను ప్రతి వైపు ఒకరు "పూర్తి ఆడియో అనుభవాన్ని వినియోగించడానికి వీలుగా ఉన్నాయి.

రియల్‌మి స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్
రియల్‌మి స్మార్ట్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రముఖ వీడియో యాప్ ల మద్దతుతో పాటుగా ఇవి ఆండ్రాయిడ్ మద్దతుతో రన్ అవుతాయి. ఇంకా గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000 కి పైగా అనువర్తనాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మద్దతుతో ప్రారంభించబడినందున ఇది వినియోగదారులను వారి వాయిస్ ఉపయోగించి కంటెంట్‌ను కనుగొనటానికి మరియు శోధించడానికి అనుమతిస్తుంది. అదనంగా Chromecast కూడా అంతర్నిర్మితంగా ఉంది మరియు ఇది వినియోగదారులు తమ పరికరాల్లోని కంటెంట్‌ను స్మార్ట్ టీవీకి ప్రతిబింబించేలా చేస్తుంది.

రియల్‌మి స్మార్ట్ టీవీ కనెక్టివిటీ
కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే రియల్‌మి టీవీ బ్లూటూత్ 5.0 మరియు 2.4 GHz వైఫైకి మద్దతు ఇస్తుందని చెబుతున్నారు. అలాగే ఇందులో మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి, ఒక AV మరియు ఒక డిజిటల్ ఆడియో అవుట్ పోర్ట్‌తో పాటు లాన్ పోర్టు కూడా ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ స్మార్ట్ రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్‌కు శీఘ్ర యాక్సిస్ తో పాటు నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యక్ష యాక్సిస్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








