ఈ యాప్ లలో Jio ప్లాన్లను రీఛార్జ్ చేయండి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి!! మిస్ చేసుకోకండి...

|

ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంది. అందులో భాగంగా ఈ సంస్థ ఫిబ్రవరి 16, 2021 మరియు ఫిబ్రవరి 28, 2021 మధ్య చెల్లుబాటు కాలానికి కొత్తగా కొన్ని రీఛార్జ్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. అయితే వాటిని Paytm, Amazon వంటి ఇతర మూడవ పార్టీ రీఛార్జ్ పోర్టల్స్ ద్వారా మాత్రమే పొందవచ్చు.

జియో రీఛార్జ్ ఆఫర్‌లు
 

సాధారణ జియో యొక్క అధికారిక రీఛార్జ్ ఆఫర్‌లు ఇప్పుడు కొద్దిగా నిరాశను కలిగిస్తున్నాయి. ఇతర పోర్టల్స్ ద్వారా రీఛార్జ్ చేసేవారికి ప్రస్తుతం అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది జియో ప్రీపెయిడ్ వినియోగదారులు మైజియో యాప్ ద్వారా రీఛార్జిలు చేస్తారు. కాని ఇప్పుడు ఈ నెల చివరి వరకు మూడవ పార్టీ ద్వారా లభించే రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫోన్‌పే యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

ఫోన్‌పే యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

జియో వినియోగదారుల కోసం ఫోన్‌పే 260 రూపాయల వరకు 'స్క్రాచ్ & విన్' రివార్డులను అందిస్తోంది. యూజర్లు ఈ నెల మొదటి రీఛార్జిలో 140 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చని ఫోన్‌పే తెలిపింది. అలాగే రెండవ మరియు మూడవ రీఛార్జ్‌లపై (రూ .60 + రూ .80) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. జియో యూజర్లు క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని యుపిఐ మరియు యుపిఐ + వాలెట్ ద్వారా చేసిన పేమెంట్ లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని గమనించండి. రీఛార్జ్ చేసిన తరువాత స్క్రాచ్ కార్డ్ వినియోగదారులకు బట్వాడా చేయబడుతుంది. ఫోన్‌పే ఆఫర్ నిబంధనలు మరియు షరతుల ఆఫర్ ప్రకారం మొదటి రీఛార్జ్ రూ.125 మరియు అంతకంటే ఎక్కువ ఉండాలి.

Paytm రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్
 

Paytm రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

భారతదేశంలో ప్రసిద్ధ డిజిటల్ పేమెంట్ వేదిక అయిన పేటిఎమ్ రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కలిగి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జియో ప్రీపెయిడ్ వినియోగదారులు మొదటి, రెండవ మరియు మూడవ రీఛార్జిల మీద ఫ్లాట్ రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఇప్పటికే ఉన్న కస్టమర్లు రివార్డుల రూపంలో 1,000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నిబంధనలు మరియు షరతుల ప్రకారం ఈ ప్రత్యేక ఆఫర్‌కు అర్హత సాధించడానికి కనీసం రూ.48లతో రీఛార్జ్ చేయాలి. రివార్డుల విషయానికొస్తే Paytm వోచర్లు లేదా లాక్ చేసిన స్క్రాచ్ కార్డులు లేదా బ్రాండ్ వోచర్లను పంపిణీ చేస్తుంది.

అమెజాన్ యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

అమెజాన్ యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

రిలయన్స్ జియో యొక్క కొత్త మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా రీఛార్జ్ చేసిన వారికి రూ.125 వరకు అమెజాన్ పే రివార్డులను పొందే అవకాశం కల్పిస్తున్నది. ఈ రివార్డులు అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లేదా షాపింగ్ కేటగిరీ కూపన్ లేదా మనీ ట్రాన్స్ఫర్ లేదా స్కాన్ & పే కూపన్ లేదా బిల్ పేమెంట్ కూపన్ వంటి రూపంలో లభిస్తుంది అని అమెజాన్ తెలిపింది.

మొబిక్విక్ యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

మొబిక్విక్ యొక్క రిలయన్స్ జియో రీఛార్జ్ ఆఫర్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు మొబిక్విక్ అనేక రీఛార్జ్ ఆఫర్లను అందిస్తోంది. మొట్టమొదటి కనీసం 149 రూపాయల రీఛార్జిపై మొబిక్విక్ యుపిఐ ఆఫర్ లావాదేవీ మీద రూ.50 వరకు 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రీఛార్జ్ చేసేటప్పుడు కొత్త వినియోగదారులు ‘NJIO50' కోడ్‌ను వర్తింపజేయవలసి ఉంటుంది. ప్రస్తుత Jio కస్టమర్లు ‘JIO50P' కోడ్‌ను వర్తింపజేయడం ద్వారా 50% రూపాయల వరకు సూపర్ క్యాష్‌గా పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Recharge Reliance Jio Plans Through These Apps!! Chance to Get Cashback up to Rs.1000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X