Home
News

Redmi Note 9 Pro, Mi Earphones 2 సేల్స్!!! Rs.1000 తగ్గింపుతో గొప్ప అవకాశం...

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఇండియాలో మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నది. ఇండియాలో షియోమి సంస్థ యొక్క అన్ని రకాల స్మార్ట్ వస్తువులకు మంచి ఆదరణ లభిస్తున్నది. గత వారంలో షియోమి సంస్థ కొత్తగా మరొక మూడు ప్రొడెక్టులను ఇండియాలో విడుదల చేసింది. అందులో షియోమి Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 యొక్క సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి మొదలుకానుంది.

స్మార్ట్‌ఫోన్

వీటితో పాటుగా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మళ్ళి మొదలుకానున్నాయి. వీటి యొక్క అమ్మకాలు అమెజాన్ ఇండియా, Mi.కామ్ మరియు Mi హోమ్ స్టోర్స్ ద్వారా మొదలుకానున్నాయి. షియోమి యొక్క Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ధర భారతదేశంలో రూ.4,999 గా నిర్ణయించబడింది. కానీ ఇప్పుడు వీటిని పైన పేర్కొన్న ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాయితీ ధర వద్ద పొందవచ్చు. షియోమి ఇయర్‌ఫోన్‌లు ఒకే ఒక కలర్ వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ ధరలు & ఆఫర్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ ధరలు & ఆఫర్స్

భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ను రెండు వేరియంట్‌లలో పొందవచ్చు. ఇందులో బేస్ మోడల్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.13,999 ఉండగా హై-ఎండ్ మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.16,999. వీటి యొక్క సేల్స్ అమెజాన్ మరియు Mi.కామ్ రెండింటిలోను మధ్యాహ్నం 12 గంటలకు అద్భుతమైన కొన్ని ఆఫర్లతో ప్రారంభమవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు EMI లావాదేవీలపై రూ.1,000 తగ్గింపును అందిస్తున్నది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌తో కొన్ని ముఖ్యమైన మార్పులతో సమానంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 ప్రో ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC, అడ్రినో 618 GPU ను కలిగి ఉండి 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

స్టోరేజ్ పరంగా రెడ్‌మి నోట్ 9 ప్రో 128GB వరకు UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, NavIC, USB Type-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ సెన్సార్‌తో వస్తుంది మరియు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లతో పాటు శబ్దం రద్దు మద్దతుతో డ్యూయల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.

షియోమి ఇయర్‌బడ్స్2 ధరలు మరియు ఆఫర్ వివరాలు

షియోమి ఇయర్‌బడ్స్2 ధరలు మరియు ఆఫర్ వివరాలు

షియోమి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ యొక్క ధర ఇండియాలో రూ.4,999. కానీ ప్రస్తుతం అమ్మకం సమయంలో షియోమి Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ను రూ.1,000ల తగ్గింపు ధరతో లభిస్తుంది. అంటే మీరు దీన్ని కేవలం రూ.3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మే 12 నుండి మే 17 లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే రూ.1000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా షియోమి Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను ఉచితంగా పొందడానికి షియోమి Mi 10 ను కొనుగోలు చేస్తే దానితో పాటు ఇయర్‌ఫోన్‌లను ఉచితంగా పొందవచ్చు.

Mi ఇయర్‌బడ్స్‌ స్పెసిఫికేషన్స్

Mi ఇయర్‌బడ్స్‌ స్పెసిఫికేషన్స్

తాజా షియోమి Mi ఇయర్‌బడ్స్‌లో 14.2 mm డైనమిక్ డ్రైవర్ మరియు టైటానియం కాంపోజిట్ డయాఫ్రాగమ్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జీతో నాలుగు గంటల బ్యాటరీ జీవితాన్ని అందించగలవని షియోమి పేర్కొంది. అలాగే కాంపాక్ట్ కేసు 14 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది అని కంపెనీ తెలిపింది.

Mi ఇయర్‌బడ్స్‌ 2 ఫీచర్స్

Mi ఇయర్‌బడ్స్‌ 2 ఫీచర్స్

షియోమి Mi ఇయర్‌బడ్స్‌ 2 యొక్క బ్యాటరీ లైఫ్ రేటింగ్ 80 శాతం వాల్యూమ్ మీద ఆధారపడి ఉందని గమనించడం ముఖ్యం. Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ నోయిస్-లెస్ మైక్రోఫోన్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది పర్యావరణ శబ్దాన్ని 30dBకి తగ్గించగలదు. ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉంది. దీని పూర్తి ఛార్జ్ కోసం ఒక గంట 10 నిమిషాలు పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే షియోమి Mi ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 భారతదేశానికి ట్యూన్ చేయబడిందని చెబుతోంది. ఇవి LHDC కోడెక్‌కు మరియు జాప్యం 250msకు మద్దతు ఇస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 9 Pro Max, Mi True Wireless Earphones 2 Sale Starts Today in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X