RS.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ల పోటీలో విజయం ఎవరిది?

|

భారత టెలికాం పరిశ్రమ పోటీతో ముంచెత్తుతోంది. టెలికాం ఆపరేటర్లు ఒకదానితో ఒకటి పోటీపడి ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించారు. ఈ పోటీ అన్ని రకాల ధరల విభాగాలలో నీవా లేక నేన అని ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. 500 రూపాయల కంటే తక్కువ ఉన్న ధర సెగ్మెంట్ ఇంతకు ముందు అత్యంత పోటీగా పరిగణించబడింది.

Rs 999 Prepaid Plans Comparison: Reliance Jio vs Bharti Airtel vs Vodafone vs Idea

కాని ఇప్పుడు చందాదారులు ఎక్కువగా దీర్ఘకాలిక ఎంపికలను ఎంచుకుంటున్నందున ప్రైసియర్ ప్లాన్లు కూడా పోటీగా మారాయి. ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే ఈ రోజుల్లో మనం చూడబోయే కొన్ని స్టాండర్డ్ ప్లాన్లు రూ.999 మరియు రూ.1,699 గ ఉన్నాయి. ఇప్పటికే 1,699 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు మరియు వాటిని అందించే అన్ని టెలికాం ఆపరేటర్ల నుండి పోల్చి చూసాము.

Rs 999 Prepaid Plans Comparison: Reliance Jio vs Bharti Airtel vs Vodafone vs Idea

ఇప్పుడు టెల్కోస్ నుండి వచ్చిన 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు అన్ని తెలుసుకోవడానికి కింద చదవండి.

వోడాఫోన్ రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్:

వోడాఫోన్ రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్:

వోడాఫోన్ యొక్క 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటాతో కాకుండా సంప్రదాయ అపరిమిత డేటా సమర్పణతో వస్తుంది. అంతేకాకుండా వోడాఫోన్ యొక్క ఈ ప్లాన్‌ మొదటి స్పష్టమైన ప్రయోజనం అపరిమిత లోకల్ మరియు నేషనల్ కాలింగ్ సదుపాయం. మరియు డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్ చందాదారుల కోసం12GB 4G / 3G డేటాను మరియు 3600 SMS లతో 365 రోజుల పాటు అందిస్తుంది . అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ వోడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఉచిత లైవ్ టీవీ మరియు సంగీతాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ .998 ప్రీపెయిడ్ ప్లాన్:

ఎయిర్‌టెల్ రూ .998 ప్రీపెయిడ్ ప్లాన్:

ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ మిగిలిన వాటితో సరిగ్గా సరిపోలడం లేదు కానీ ఇతరులతో చాలా పోల్చదగినది. 998 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 12 GB డేటాతో పాటు పైన పేర్కొన్న ప్లాన్ మాదిరిగానే 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. చందాదారులు అపరిమిత కాలింగ్ మరియు 28 రోజులకు 300 ఎస్ఎంఎస్ కూడా ఆనందిస్తారు. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టివి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఒక సంవత్సరం నార్టన్ మొబైల్ సెక్యూరిటీ మరియు 4G డివైస్ క్యాష్‌బ్యాక్ రూ .2,000 వరకు ఉన్నాయి.

ఐడియా రూ 999 ప్రీపెయిడ్ ప్లాన్:
 

ఐడియా రూ 999 ప్రీపెయిడ్ ప్లాన్:

ప్రీపెయిడ్ విభాగంలో ఐడియా యొక్క 999 రూపాయల ఆఫర్ ఇతర సమర్పణల మాదిరిగానే ఇది కూడా 365 రోజుల చెల్లుబాటు సమయంతో వస్తుంది. ఈ ప్లాన్ లో టెలికాం ఆపరేటర్ అపరిమిత లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్ కాల్‌లతో మొత్తం చెల్లుబాటు కాలానికి 12GB డేటాను అందిస్తుంది. చందాదారులు 365 రోజుల కాల వ్యవధిలో మొత్తంగా 3600 SMS లని ఆనందిస్తారు. అయితే మిగిలిన వారితో పోలిస్తే ఈ ప్రణాళికకు గుర్తించదగిన అదనపు ప్రయోజనాలు లేవు.

రిలయన్స్ జియో రూ 999 ప్రీపెయిడ్ ప్లాన్:

రిలయన్స్ జియో రూ 999 ప్రీపెయిడ్ ప్లాన్:

రిలయన్స్ జియో నుండి వచ్చిన రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్ మనం పైన చూసిన అన్ని ప్లాన్‌ల మాదిరిగా కాకుండా కాస్త బిన్నంగా ఉంది. రిలయన్స్ జియో సంస్థ పూర్తిగా డేటాపై ఎక్కువ దృష్టి పెట్టింది. జియో యొక్క 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ అందించే చెల్లుబాటు సమయం కేవలం 90 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో జియో సంస్థ 60GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఇవే కాకుండా వినియోగదారులు రోజుకు 100 SMS లను కూడా పొందవచ్చు. చందాదారులు జియో యొక్క అన్ని యాప్ ల పోర్ట్‌ఫోలియోకు కంప్లిమెంటిరీ సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Rs 999 Prepaid Plans Comparison: Reliance Jio vs Bharti Airtel vs Vodafone vs Idea

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X