జియో ఫైబర్ కు గట్టి పోటీగా BSNL కొత్త ఫ్యామిలీ కాంబో ప్లాన్:షాక్ లో జియో సంస్థ

|

సెప్టెంబర్ 5 నుండి వినియోగదారులకు రిలయన్స్ జియో ఫైబర్ అందుబాటులోకి వస్తున్నందువలన బిఎస్ఎన్ఎల్ యొక్క హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అతిపెద్ద ఒత్తిడిని ఎదుర్కొంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇటీవల ముఖేష్ అంబానీ నేతృత్వంలోని సంస్థ జియోఫైబర్ నుండి కమర్షియల్ రోల్ 2019 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని ప్రకటించింది. జియోఫైబర్ యొక్క సర్వీస్ ప్రారంభ ధర నెలకు 700 రూపాయలకు లభిస్తుంది.

Jio Fiber Effect: BSNL Launched New Family Combo Plan at Rs 1,199

గరిష్టంగా నెలకు 10,000 రూపాయల వరకు వెళ్తుంది. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి చొచ్చుకుపోయి మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని వాగ్దానం చేస్తున్నప్పటికీ బిఎస్‌ఎన్‌ఎల్ తమ వంతు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్లేయర్ తన అపరిమిత కాంబో ప్లాన్ సహాయంతో పోటీకి సిద్దమవుతున్నట్లు భావిస్తున్నారు.

BSNL Rs 1,199 family combo plan:

BSNL Rs 1,199 family combo plan:

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అత్యంత ఆసక్తికరమైన ప్రణాళిక BSNL BBG కాంబో ULD1199 ఫ్యామిలీ. దీని యొక్క పేరుకు తగ్గట్టుగా ఇది మొబైల్ నెట్‌వర్క్ సేవలతో పాటు ప్రాథమిక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందించే కాంబో ప్లాన్. చందాదారులు రోజువారీ డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. JioFiber తో రిలయన్స్ టెలివిజన్ మరియు అపరిమిత ల్యాండ్‌లైన్ కాలింగ్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించాలని యోచిస్తోంది. అయితే టారిఫ్ ప్లాన్‌లతో తన 4G మొబైల్ సేవలను కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు కనిపించడం లేదు. బిఎస్ఎన్ఎల్ బండిల్ మొబైల్ సేవలను అందించడం ద్వారా ప్రయోజనం పొందుతుంది.

ప్లాన్ వివరాలు:

ప్లాన్ వివరాలు:

బిఎస్‌ఎన్‌ఎల్ తన BBG కాంబో ULD 1199 ఫ్యామిలీతో ఒకే ధరతో మూడు సర్వీస్ లను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు మొబైల్ నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ మరియు ల్యాండ్‌లైన్ సేవలు లభిస్తాయి. అంతర్జాతీయ ఆపరేటర్లు తమ ఇంటిలో అందించే సేవలకు ఇది సమానం. భారతదేశంలో ఇటువంటి సేవను అందించే ఏకైక ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్. వ్యక్తిగత సేవలకు చెల్లించకూడదనుకునే వినియోగదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ప్రయోజనాలు:

ప్రయోజనాలు:

ఈ ప్రణాళికతో వినియోగదారులు రోజుకు 10Mbps స్పీడ్ తో 30GB FUP పరిమితి డేటాను పొందుతారు. FUP పరిమితి తరువాత బ్రాడ్‌బ్యాండ్ యొక్క వేగం 2Mbps కి పడిపోతుంది. కానీ వినియోగదారులు అపరిమిత డేటాను 2Mbps స్పీడ్ తో అనుభవించవచ్చు. భారతదేశంలోని ఏదైనా నెట్‌వర్క్‌కు కాల్ చేయడానికి అపరిమిత కాల్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా ఉంటుంది. మొబైల్ కనెక్షన్ల కోసం మొత్తం మూడు సిమ్ కార్డులతో ఈ ప్లాన్ వస్తుంది. ఈ సిమ్ నంబర్లతో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్‌లను చేయవచ్చు. అంతేకాకుండా ఈ సిమ్ కార్డులకు 1GB రోజువారీ డేటా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా FUP పరిమితి తర్వాత ఇంటర్ నెట్ స్పీడ్ 80kbps కు తగ్గించబడుతుంది. ఈ మొబైల్ కనెక్షన్‌లో ఒకదానికి ఉచితంగా ఆన్‌లైన్ టీవీ యాక్సిస్ ను కూడా పొందవచ్చు. ఈ మొత్తం ప్రయోజనాలు 1,199 రూపాయల వద్ద బిఎస్ఎన్ఎల్ BBG కాంబో ULD 1199 ఫ్యామిలీ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తో పొందవచ్చు ఇది ప్రత్యేకమైన సమర్పణగా నిలుస్తుంది.

Best Mobiles in India

English summary
Jio Fiber Effect: BSNL Launched New Family Combo Plan at Rs 1,199

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X