Reliance Jio అందిస్తున్న అద్భుతమైన బంపర్ ఆఫర్ ...
రిలయన్స్ జియో తన జియోఫైబర్ కస్టమర్లందరికీ డబుల్ డేటా ఆఫర్ను ఇప్పుడు ప్రకటించింది. దీనితో పాటుగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్లాన్ ను ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని సంస్థ తన ప్రస్తుత జియోఫైబర్ వినియోగదారులందరికీ డబుల్ డేటాను ప్రస్తుతం లభిస్తున్న అన్ని రకాల రీఛార్జిల మీద అందిస్తున్నట్లు తెలిపింది. ఇంకా 10Mbps క్యాప్ తో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరినీ కనెక్ట్ చేయడానికి ఉద్దేశించినది. కరోనావైరస్ పరిస్థితికి వ్యతిరేకంగా సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా మార్చి 23 న డబుల్ డేటా ఆఫర్ మరియు బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మొదట వెల్లడించింది.

JioFiber డబుల్ డేటా ఆఫర్
జియో ఫైబర్ యొక్క డబుల్ డేటా ఆఫర్ రూ.649 ధర గల బేసిక్ బ్రోన్జ్ ప్లాన్ నుండి రూ .8,499 ధర గల టైటానియం ప్లాన్ వరకు కూడా వర్తిస్తుంది. సంస్థ యొక్క బ్రోన్జ్ ప్లాన్ వినియోగదారులకు ఇప్పుడు 100GB నుండి 200GB డేటాను అందుకుంటారు. అలాగే సిల్వర్ ప్లాన్ యూజర్లు ఇప్పుడు 200GB నుండి 400GB డేటాను అందుకుంటారు.

జియో ఫైబర్ యొక్క గోల్డ్ ప్లాన్ ఇప్పుడు 500GB నుండి 1000GB డేటాను అందిస్తుంది. అలాగే డైమండ్ ప్లాన్ వినియోగదారులు ఇప్పుడు 1200GB డేటా నుండి 2500GB డేటాను అందుకుంటారు. అదేవిధంగా సంస్థ యొక్క ప్లాటినం మరియు టైటానియం ప్లాన్ కూడా డేటాలో మార్పులను చేసింది. ఈ ప్లాన్లు ఇప్పుడు వరుసగా 5000GB మరియు 10000GB డేటాను మరియు 250GB నుండి 5000 GB వరకు డేటాను అందిస్తున్నాయి. అదనపు డేటా ఆఫర్ దాని వెబ్‌సైట్‌లోని JioFiber యొక్క ప్లాన్ ల విభాగాలలో మరియు సంస్థ యొక్క మొబైల్ యాప్ లో చూడవచ్చు.

JioFiber బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ
రిలయన్స్ జియో యొక్క 10Mbps వేగంతో క్యాప్ చేయబడిన బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్లాన్ దేశంలో కొన్ని చోట్ల ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా వర్తిస్తుంది. మార్చి 23 న కొత్త కనెక్షన్ వినియోగదారులకు కంపెనీ తిరిగి చెల్లించదగిన డిపాజిట్‌తో అందిస్తున్నట్లు తెలిపింది.

సబ్-పార్ FUP పరిమితి కారణంగా JioFiber చాలా మంది వినియోగదారులను ఆకర్షించలేకపోయింది. కానీ ఈ కొత్త మార్పుతో చాలా మంది రిలయన్స్ జియో నుండి వైర్డు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసును ఎన్నుకుంటారు. ఏదేమైనా భారతదేశంలో లాక్డౌన్ పరిస్థితిలో వినియోగదారులు ఇంటి నుండి పని చేయడాన్ని ప్రోత్సహించడానికి మరియు జియోఫైబర్ను ఎంచుకోవడానికి కంపెనీ దీనిని తయారు చేసిందని గమనించాలి. భారతదేశంలో పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఈ రెండు మార్పులు వెనక్కి వస్తాయి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 100Mbps వేగంతో అందిస్తోంది. అపరిమిత డేటా యాడ్-ఆన్ రూపంలో ఇది కేవలం 299 రూపాయల ధరతో అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నది. ప్రస్తుత జియోఫైబర్ వినియోగదారులు డబుల్ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. కాని కొత్త కస్టమర్లు 50% ఎక్కువ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉదాహరణకు ప్రస్తుత వినియోగదారుల కోసం బేస్ JioFiber Rs 699 ప్లాన్ 200GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే కొత్త కస్టమర్ల కోసం ఇది 50GB ఎక్కువ డేటాను అందిస్తుంది. అంటే దీని మొత్తం డేటా ప్రయోజనం 250GBగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








