Home
News

JioFiber యూజర్లు 10 Mbps ఇంటర్నెట్ ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు

భారతదేశంలో టెలికాం పరిశ్రమలో తక్కువ కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆపరేటర్లలో రిలయన్స్ జియో ఒకటి. రిలయన్స్ జియో యొక్క వైర్డు బ్రాడ్‌బ్యాండ్ ఆర్మ్ ఇప్పుడు జియో ఫైబర్ గా మార్పు చెందింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఫైబర్ 10 Mbps వేగంతో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందిస్తోంది.

ఇంటర్నెట్ కనెక్షన్‌

ఇంటర్నెట్ కనెక్షన్‌

ఈ ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌ కేవలం ఎంచుకున్న ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది జియో ఎగ్జిక్యూటివ్ తనిఖీ చేసిన తరువాత ఖరారు చేయబడుతుంది. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్లు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ఆఫర్లను అందిస్తున్నారు.

అప్‌గ్రేడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

అప్‌గ్రేడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎక్సైటెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పటికే ఒక కొత్త ఆఫర్‌ను ప్రకటించింది ఇందులో చందాదారులు ఒక నెల సేవలను ఉచితంగా పొందుతారు. అలాగే ACT ఫైబర్‌నెట్ కూడా వినియోగదారుడిని 300 Mbps ప్లాన్ మరియు అపరిమిత డేటాకు అప్‌గ్రేడ్ చేసింది.

 

 

వై-ఫై రూటర్ కోసం రూ.1,500 వాపసు డిపాజిట్

వై-ఫై రూటర్ కోసం రూ.1,500 వాపసు డిపాజిట్

రిలయన్స్ జియోఫైబర్ వినియోగదారులకు 10 ఎమ్‌బిపిఎస్ వరకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంది. అయితే వై-ఫై రౌటర్ కోసం జియోఫైబర్ చందాదారులు రూ.1,500ల తిరిగి చెల్లించే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ గుర్తించింది. ఇది మాత్రమే కాదు సంస్థ అందించే ప్రాథమిక ప్లాన్ లకు పరిమితులు కూడా ఉండవు. ఇది చందాదారులకు ఎటువంటి స్థిర న్యాయ వినియోగ విధానం (ఎఫ్‌యుపి) లేకుండా పేర్కొన్న వేగంతో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌

ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌

ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను పొందాలని చూస్తున్న చందాదారులకు ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ యొక్క లభ్యత గ్రాఫికల్ ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనెక్షన్ అందుబాటులో ఉంటే కనుక జియో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తనిఖీ చేసి కనెక్షన్ అభ్యర్థనను సీనియర్ అధికారులకు బదిలీ చేసిన తరువాత మాత్రమే ఇది సాధ్యపడుతుంది. కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం ప్రారంభించిన వర్క్ @ హోమ్ కు మద్దతుగా రిలయన్స్ జియో నెలకు రూ.699 నుండి ప్రారంభమయ్యే డేటా వినియోగ ప్రణాళికలను కూడా రెట్టింపు చేసింది.

MTNL సర్కిల్‌లలో డబుల్ డేటా ఆఫర్

MTNL సర్కిల్‌లలో డబుల్ డేటా ఆఫర్

కోవిడ్ -19 ప్రాణాంతక వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడానికి దేశంలోని మొత్తం ప్రజలు ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఇటీవల ప్రభుత్వం మార్చి 31, 2020 వరకు న్యూ డిల్లీ మరియు ముంబైలను లాక్డౌన్ చేసింది. ఇంటి వద్ద నుండి తమ పనిని సజావుగా చేయడానికి మరియు సరైన వినోదాన్ని ఆస్వాదించడానికి MTNL తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లపై డబుల్ డేటాను ప్రకటించింది. ఇవి న్యూ ఢిల్లీ మరియు ముంబై సర్కిల్‌లో పనిచేస్తున్నాయి. అలాగే కాపర్ ఆధారిత కనెక్షన్‌లను ఎంచుకునే MTNL వినియోగదారులకు ఉచిత ఇన్స్టాలేషన్ లభిస్తుంది. ఏదేమైనా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో డబుల్ డేటా ప్రయోజనాలు డిల్లీ మరియు ముంబై సర్కిల్‌లలో ఒక నెల మాత్రమే లభిస్తాయని వినియోగదారులు గుర్తించాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance JioFiber Users get 10 Mbps Internet Plan at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X