VoWiFi ఫీచర్ ను మొదలుపెట్టిన రిలయన్స్ జియో

|

ఇండియాలో 5G రోల్ అవుట్ అవ్వడానికి ముందు టెలికాం ఆపరేటర్ల నుండి మరొక టెక్నాలజీ యొక్క రోల్ అవుట్ ను మనం చూడబోతున్నాము. అది వాయిస్ ఓవర్ వై-ఫై. కాలింగ్ మరియు నెట్‌వర్క్ టెక్నాలజీ విషయానికి వస్తే టెక్నాలజీ పురోగతిలో తదుపరి స్థాయి ఐదవ తరం నెట్‌వర్క్ టెక్నాలజీ. వాయిస్ ఓవర్ వై-ఫై అనేది సాంకేతిక పరిజ్ఞానం ఇది పేలవమైన లేదా సెల్యులార్ కనెక్టివిటీ లేని పరిస్థితుల్లో చిక్కుకున్న వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

VoWiFi

ఇటువంటి పరిస్థితులలో వినియోగదారులకు వై-ఫై కనెక్షన్ ఉంటే వారు వాయిస్ ఓవర్ వై-ఫై టెక్నాలజీని ఉపయోగించి తమకు గల పరిచయంలో ఉన్న ఎవరికైనా కాల్ చేయవచ్చు. ప్రస్తుతం VoWiFi సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని టెలికాం ఆపరేటర్ల నుండి మాత్రమే చూశాము. రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ వింగ్స్ సేవను ప్రారంభించగా, ఇతర ప్రైవేట్ టెల్కోలు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్టెల్ వంటివి VoWiFi సర్వీసును పరిమిత పద్ధతిలో విడుదల చేశాయి. వాయిస్ ఓవర్ వై-ఫై టెక్నాలజీని గత వారం భారతి ఎయిర్టెల్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు రిలయన్స్ జియో కూడా కొన్ని ప్రాంతాలలో VoWiFi ని పరీక్షిస్తోంది. మిగిలిన మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

మహారాష్ట్రలో రిలయన్స్ జియో VoWiFi ఫీచర్
 

మహారాష్ట్రలో రిలయన్స్ జియో VoWiFi ఫీచర్

రిలయన్స్ జియో యొక్క VoWiFi ఫీచర్ ఇప్పుడు మహారాష్ట్ర సర్కిల్‌లోని నాసిక్ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో వినియోగదారులకు అందిస్తున్న వాయిస్ ఓవర్ వై-ఫై ఫీచర్ యొక్క స్క్రీన్ షాట్లను కూడా వినియోగదారులు షేర్ చేసారు. వినియోగదారులు షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ఆపిల్ ఫోన్ iOS కి చెందినవి కావడం గమనించదగిన విషయం. అంటే భారతి ఎయిర్‌టెల్ VoWiFi ఫీచర్ మాదిరిగానే రిలయన్స్ జియో VoWiFi కూడా ఎంచుకున్న ఫోన్‌లలో మాత్రమే లభిస్తుంది. నిర్దిష్ట ఫోన్‌లలో మాత్రమే రిలయన్స్ జియో చందాదారులు VoWiFi ని ఉపయోగించగలరు.

VoWiFi

భారతి ఎయిర్‌టెల్ VoWiFi సర్వీస్ విషయంలో చందాదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో VoWiFi సర్వీసును యాక్సెస్ చేయగలగటానికి ఒక నిర్దిష్ట Wi-Fi నెట్‌వర్క్‌తో అనుసంధానించవలసి ఉంటుంది. రిలయన్స్ జియో విషయంలో కూడా ఈ స్క్రీన్ షాట్ విషయంలో రిలయన్స్ జియోఫైబర్ నెట్‌వర్క్ అయి ఎంచుకున్న వై-ఫై నెట్‌వర్క్ కోసం మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయంపై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ జియో VoWiFi మహారాష్ట్ర సర్కిల్‌లోని నాసిక్ ప్రాంతంలో మరియు డిల్లీ ప్రాంతంలో కూడాఅందుబాటులో ఉంది.

ఢిల్లీలో భారతి ఎయిర్‌టెల్ VoWiFi రోల్అవుట్

ఢిల్లీలో భారతి ఎయిర్‌టెల్ VoWiFi రోల్అవుట్

భారతి ఎయిర్‌టెల్ VoWiFi సర్వీసును కొద్ది రోజుల క్రితమే డిల్లీలో ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని చందాదారులు తమ ఫోన్‌లలో VoWiFi ని యాక్సెస్ చేసే అవకాశాన్ని చూసినట్లు నివేదించారు. అయితే కొన్ని ఎంచుకున్న డివైస్ లు మాత్రమే ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం డిల్లీ ప్రాంతంలో VoWiFi యాక్సెస్ ఎంపికను పొందగలిగాయి. ఆపిల్, శామ్‌సంగ్, రెడ్‌మి, వన్‌ప్లస్ సంస్థల తయారీదారుల నుంచి మొత్తంగా 24 స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 11, వన్‌ప్లస్ 7, రెడ్‌మి కె 20 వంటి ఫోన్‌లు ఎయిర్‌టెల్ VoWiFi ఫీచర్‌తో రాబోతున్నాయి.

VoWifi

VoWifi ని ప్రారంభించడానికి చందాదారులు వారి ఫోన్ యొక్క సెట్టింగుల విభాగానికి వెళ్లి ఇక్కడ చందాదారులు తమ సిమ్ యొక్క VoLTE ని ఆన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు సరైన Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వాలి. వారు దీన్ని పూర్తి చేసిన తర్వాత వినియోగదారులు తమ ఫోన్‌లలో వాయిస్ ఓవర్ వై-ఫై ఎంపికను చూడగలుగుతారు.

Best Mobiles in India

English summary
Reliance Jio Now Starting VoWiFi Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X