రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి
టెలికామ్ రంగంలో ఇప్పుడు అన్ని టెల్కోలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నాయి. వోడాఫోన్ ఐడియా మరియు ఎయిర్టెల్ ఇప్పటికే తమ దరలవివరాలను ప్రకటించాయి. ఇప్పుడు రిలయన్స్ జియో వంతు వచ్చింది.

జియో యొక్క కొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల పేరుతో వివరాలను ప్రకటించింది. ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా నుండి ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే జియో కూడా వాయిస్ కాలింగ్ నిమిషాలతో అందిస్తున్నందున టెల్కో వాటిని ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ అని పిలుస్తోంది.

ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్‌తో తన పోర్టుఫోలియోను ప్రారంభించింది. జియో కొత్తగా ప్రారంభించిన ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.129 నుండి అందిస్తుంది. మొత్తంగా రిలయన్స్ జియో ఇప్పుడు 11 ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. వీటిలో రూ.129 నుండి మొదలుకొని రూ.1,699 వరకు ప్లాన్‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు డిసెంబర్ 6, 2019 నుండి అమలులోకి వస్తాయి. వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో ఆఫ్ర్డబుల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో మూడు కొత్త ఆఫ్ర్డబుల్ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ల ధరలు వరుసగా రూ.129, రూ .329, మరియు రూ .1,299. రిలయన్స్ జియో యొక్క రూ .129 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జిబి డేటాను, 1,000 నాన్-జియో నిమిషాలు, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ మరియు 300SMS లను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.

జియో యొక్క రూ.329 ప్రీపెయిడ్ ప్లాన్ 6 జీబీ డేటా, 3,000 నాన్-జియో వాయిస్ నిమిషాలు, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMSలను 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. చివరగా వార్షిక ఆఫ్ర్డబుల్ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర 1,299 రూపాయలు. ఇది 12GB డేటాను చెల్లుబాటు మొత్తానికి అందిస్తుంది.అలాగే 12,000 నాన్-జియో నిమిషాలు,అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

రిలయన్స్ జియో మంత్లీ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లు
కొత్తగా ప్రారంభించిన నెలవారీ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల విషయానికొస్తే అవి 199 రూపాయల నుండి ప్రారంభమై రూ.349 వరకు ఉన్నాయి. జియో ఇప్పుడు 28 రోజుల చెల్లుబాటుతో కేవలం మూడు ప్లాన్‌లను మాత్రమే అందిస్తున్నది. వాటి ధరలు వరుసగా రూ.199, రూ .249, రూ .349. ఈ మూడు ప్లాన్‌లు 1,000 నాన్-జియో నిమిషాలు, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల వాలిడితో లభిస్తాయి. కాకపోతే ఈ ప్లాన్‌లు అందించే డేటాలో మార్పు ఉంటుంది. రూ.199 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాను, రూ.249 ప్లాన్ 2 జిబి రోజువారీ డేటాను మరియు రూ.349 ప్లాన్ రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది.

56 రోజుల వాలిడిటీతో జియో న్యూ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో 56 రోజుల వాలిడిటీతో రెండు ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. వాటి ధరలు వరుసగా రూ .399 మరియు రూ.444. ఈ రెండు ప్లాన్‌లు 2,000 ఆఫ్-నెట్ (నాన్-జియో) నిమిషాలు, రోజుకు 100 SMSలు మరియు అపరిమిత జియో-టు -జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. డేటా బెనిఫిట్ విషయానికొస్తే రూ.399 ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటాను అలాగే రూ .444 ప్లాన్ రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది.

84 రోజుల వాలిడిటీతో జియో ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో ఇటీవలే ప్రారంభించిన రూ.555 ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనసాగిస్తున్నది. 84 రోజుల వాలిడిటీతో మరొక సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ రూ.599 ధర వద్ద ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు రెండు 3,000 నాన్-జియో నిమిషాలు, అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. డేటా విషయానికి వస్తే రూ.555 ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన రూ.599 ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 2 జిబి రోజువారీ డేటాను అందిస్తుంది.

రిలయన్స్ జియో ఇయర్లీ ప్రీపెయిడ్ ప్లాన్
జియో ముందు అందిసున్న రూ.1,299 ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు ఇప్పుడు రూ.2,199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తున్నది. ఈ ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటా, 12,000 నాన్-జియో నిమిషాలు, అపరిమిత జియో-టు-జియో నిమిషాలు మరియు రోజుకు 100SMS వంటి ప్రయోజనాలను 365 రోజుల వాలిడిటీతో అందిస్తాయి.

పైన తెలిపిన అన్ని జియో ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లు JioTV , JioCinema, JioSaavn, JioNews, JioSecurity, JioCloud (కేవలం 5GB స్టోరేజ్) మరియు JioHealthHub యాప్ చందాలకు ఉచితంగా అదనపు ఖర్చు లేకుండా యాక్సిస్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








