జియో బ్రాడ్‌బ్యాండ్ మూడు నెలలు ఉచితం?

'Jio GigaFiber' పేరుతో రిలయన్స్ జియో లాంచ్ చేయబోతున్న బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల పై రోజకో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

జియో బ్రాడ్‌బ్యాండ్ మూడు నెలలు ఉచితం?

Read More : ఐడియా ఆఫర్లలో మార్పు, చెక్ చేసుకోండి

తాజాగా తెలియవచ్చిన సమచారం ప్రకారం జియో తన గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఢిల్లీ, ముంబై నగరాల్లో పరీక్షించబోతున్నట్లు సమాచారం. జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి చెన్నైలో ఇప్పటికు ఈ టెస్టింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఫోన్ రాడర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. జియో గిగాఫైబర్ గురించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర రూమర్స్‌ను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.500 నుంచి రూ.5,500 వరకు

అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం రిలయన్స్ జియో తన GigaFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను రూ.500 నుంచి రూ.5,500 వరకు రకరకాల టారిఫ్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. రూ.500 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 600జీబి ఇంటర్నెట్‌ ను యూజర్లు పొందే అవకాశముందని తెలుస్తోంది.

రోజు వారి ప్యాక్స్ కూడా..?

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం జియో రూ.400 రేంజ్‌లో రోజువారి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను సైతం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

600 ఎంబీపీఎస్ వేగంతో

జియో తన GigaFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లకు సంబంధించి గరిష్టం ఆఫర్ చేయబోయే రూ.5,500 ప్లాన్‌లో భాగంగా యూజర్‌కు 600 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 300జీబి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ప్లాన్ వ్యాలిడిటీ 28రోజులు ఉంటుందట.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మూడు నెలలు ఉచితం..

జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను GigaFiber బ్రాడ్‌బ్యాండ్ సేవలకు విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగితే మొదటి మూడు నెలల పాట ఉచిత ఇంటర్నెట్ ను బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఆస్వాదించవచ్చు.

మొదటి ఫేజ్‌లో భాగంగా..

మొదటి ఫేజ్‌లో భాగంగా చెన్నై, ముండై, ఢిల్లీ నగరాల్లో మాత్రమే జియో GigaFiber బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. క్రమకమంగా ఈ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని సమాచారం. రూ.3కే రోజంతా 3జీ ఇంటర్నెట్

బీఎస్ఎన్ఎల్ BBG 1199

త్వరలో లాంచ్ కాబోతున్న రిలయన్స్GigaFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. BBG 1199 పేరుతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్నకాంబో ప్లాన్‌ ఆకట్టుకుంటోంది.

నెల మొత్తం డేటా, వాయిస్ కాల్స్ ఫ్రీ..

బీఎస్ఎన్ఎల్ BBG 1199 ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1199 చెల్లించటం ద్వారా నెల మొత్తం డేటా, వాయిస్ కాల్స్ ఇలా అన్ని సర్వీసులను అపరిమితంగా వాడుకోవచ్చు.

దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితం

ఈ ఆఫర్‌లో భాగంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. BBG కాంబో ప్లాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌లో వినియోగదారులు నెలకు రూ.1199 ఛార్జ్‌తో దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితంగా చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్

బాండ్‌విడ్త్ డౌన్‌లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కన్నా వేగంగా ఉంటుంది. ఈ ఆఫర్‌ను అన్ని సర్కిళ్లలో అందరూ ఉపయోగించుకోవచ్చు. నెలకి రూ. 1199 ఛార్జ్ చేయబడుతుంది.

 

సంవత్సరం ప్లాన్ రూ.13,189

నెలకి రూ. 1199 ఛార్జ్ చేయబడుతుంది. ఇదే ప్లాన్ సంవత్సరానికి కావాల్సిన వారు రూ. 13,189 ఛార్జ్‌తో ఉపయోగించుకోవచ్చని BSNL తెలిపింది.

రెండు సంవత్సరాల ప్లాన్ రూ.25179

ఇదే ప్లాన్ రెండు సంవత్సరాలకు అయితే రూ.25179, మూడు సంవత్సరాల కయితే రూ.35970 ఛార్జ్ తో ఉపయోగించుకోవచ్చని BSNL చెబుతోంది. ఈ ప్లాన్‌లో డౌన్‌లోడ్ అలాగే అప్‌లోడ్ అన్‌లిమిటెడ్. నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? జరభద్రం!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to Offer GigaFiber Broadband Service as Welcome Offer: Everything You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot