డేటా వినియోగంలో మొబైల్ ఆపరేటర్‌లు ఎవరి స్థానం ఎంతో తెలుసా?

|

రెగ్యులేటర్ ట్రాయ్ యొక్క డేటా ప్రకారం రిలయన్స్ జియో 32.29 కోట్ల మంది సభ్యులతో మరియు 27.80 శాతం మార్కెట్ వాటాతో మే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. రిలయన్స్ జియో 2016 సెప్టెంబరులో అత్యంత వివాదాస్పదమైన వాయిస్ మరియు డేటా సమర్పణలతో అత్యంత పోటీతత్వ టెలికాం రంగంలోకి ప్రవేశించడంతో డేటా వినియోగం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

reliance jio overtakes airtel to become indias second largest mobile operator

భారతి ఎయిర్టెల్ 1995 లో తన సేవలను ప్రారంభించింది.డేటా వినియోగంలో మొబైల్ ఆపరేటర్‌లు ఎవరి స్థానం ఎక్కడ ఉందొ మరియు ఇండియన్ మార్కెట్లో ఎవరు ఎంత వాటా కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి కింద చదవండి.

వొడాఫోన్ ఇండియా :

వొడాఫోన్ ఇండియా :

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం పాత ఆపరేటర్ల వొడాఫోన్ ఇండియా మరియు ఐడియా సెల్యులార్ విలీనం తరువాత గత సంవత్సరం ప్రారంభమైన వోడాఫోన్ ఐడియా మే 31, 2019 నాటికి వైర్‌లెస్ విభాగంలో 38.75 కోట్ల మంది వినియోగదారులతో మరియు 33.36 శాతం మార్కెట్ వాటాతో అతిపెద్ద ఆపరేటర్‌గా కొనసాగుతోంది .

భారతి ఎయిర్‌టెల్:

భారతి ఎయిర్‌టెల్:

సునీల్ మిట్టల్ నేతృత్వంలో ప్రమోట్ చేసిన భారతి ఎయిర్‌టెల్ మే నెల నాటికీ 32.03 కోట్ల మంది మొబైల్ చందాదారులతో మరియు 27.58 శాతం మంది చందాదారుల మార్కెట్ వాటాతో మూడవ స్థానానికి పడిపోయింది. రిలయన్స్ జియో మే నెలలో 81.80 లక్షల మంది కొత్త చందాదారుల (నికర ప్రాతిపదికన) చేరికతో 27.80 శాతం మార్కెట్ వాటాతో మరియు 32.29 కోట్ల మంది సభ్యులతో రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.

బిఎస్‌ఎన్‌ఎల్:
 

బిఎస్‌ఎన్‌ఎల్:

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం నుండి రిలీఫ్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్న మరియు తీవ్రమైన ఖర్చు తగ్గించే చర్యలను చేపట్టిన నగదు కొరత గల టెలికాం PSU భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్)లో మే నెలలో 2,125 మంది వైర్‌లెస్ చందాదారులను చేర్చుకున్నది. వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు అధిక ARPU (అవేరేజ్ రెవెన్యూ పర్ యూసర్)లను వెంబడించడానికి మరియు ఆర్థిక మెరుగుదల కోసం తపనతో కనీస రీఛార్జ్ పథకాలను ప్రవేశపెట్టారు. వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ కంపెనిలు కోల్పోయిన చందాదారులు వరుసగా 56.97 లక్షలు మరియు 15.08 లక్షల మంది వినియోగదారులు.

ఏప్రిల్‌లో ర్యాంకింగ్‌:

ఏప్రిల్‌లో ర్యాంకింగ్‌:

మేలో ర్యాంకింగ్‌ క్రమంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇది 2019 ఏప్రిల్‌లోని ర్యాంకింగ్‌లకు చాలా భిన్నంగా ఉంది. అప్పుడు భారతి ఎయిర్‌టెల్ 32.18 కోట్ల మంది సభ్యులతో మరియు మొత్తం వైర్‌లెస్ మార్కెట్లో 27.69 శాతం వాటాను కలిగి ఉండి ఇండియాలో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్నది. రిలయన్స్ జియో ఏప్రిల్‌లో పాత ఆపరేటర్‌లను అందరిని వెనక్కి నెట్టి 31.48 కోట్ల మంది సభ్యులతో మరియు 27.08శాతం మార్కెట్ మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. భారతదేశంలో ఏప్రిల్‌లో కూడా వోడాఫోన్ ఐడియా 39.32 కోట్ల మంది చందాదారులు మరియు మొత్తం వైర్‌లెస్ మార్కెట్లో 33.83 శాతం మందితో మార్కెట్లో అతిపెద్ద ఆపరేటర్‌గా ఉంది అని గత నెల ట్రాయ్ డేటా వెల్లడించింది.

Best Mobiles in India

English summary
reliance jio overtakes airtel to become indias second largest mobile operator

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X