JioPhone యూజర్లకు కొత్తగా విడుదలైన డేటా ప్లాన్‌ల మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలో అధికంగా యూజర్ బేస్ ను కలిగి ఉన్న రిలయన్స్ జియో టెల్కో జియోఫోన్ వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా ఐదు డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్లు రూ.22 నుండి ప్రారంభమయి రూ.152 మధ్య ఉన్నాయి. ఈ ఐదు ప్లాన్‌లు అన్ని కూడా 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. టెల్కో ఇటీవల రూ.749 ధర వద్ద కొత్తగా ప్రారంభించిన వార్షిక ప్లాన్ తరువాత ఈ కొత్త ప్లాన్‌లను పరిచయం చేసింది. గత వారం ప్రస్తుత జియోఫోన్ వినియోగదారుల కోసం రూ.749 వార్షిక ప్లాన్‌ను మరియు కొత్త కస్టమర్ల కోసం రూ.1,999 & రూ.1,499 ధరల వద్ద రెండు ప్లాన్‌లను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్లు రూ.11 ప్రారంభ ధర వద్ద నుండి 4G డేటా వోచర్‌లను పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. జియోఫోన్ వినియోగదారుల కోసం అందుబాటులో గల డేటా ప్యాక్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫోన్ రూ.22 డేటా ప్యాక్ ప్రయోజనాలు
కేవలం రూ.22 ధర వద్దనే లభించే ఎంట్రీ లెవల్ జియోఫోన్ డేటా ప్లాన్ 2GB 4G డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. జియోటీవీ, JioCinema, JioSecurity మరియు JioNews వంటి అన్ని జియో యాప్ లకు టెల్కో ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

జియోఫోన్ రూ.52 డేటా ప్యాక్ ప్రయోజనాలు
జాబితాలో తదుపరి డేటా ప్లాన్ జియోఫోన్ రూ 52 డేటా ప్లాన్. ఇది 6GB 4G డేటాను అదే 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ హై-స్పీడ్ డేటా వినియోగం తరువాత వినియోగదారులు 64 Kbps వద్ద డేటాను బ్రౌజ్ చేయవచ్చు. ఇది వాట్సాప్ మెసేజ్ లను పంపడానికి మరియు స్వీకరించడానికి సరిపోతుంది.

జియోఫోన్ రూ 72 డేటా ప్యాక్ ప్రయోజనాలు
రూ.52 మరియు రూ.72 ధరల వద్ద లభించే జియోఫోన్ డేటా ప్లాన్‌ల మధ్య డేటా బెనిఫిట్ విషయంలో చాలా తేడా ఉంది. రూ.72 ప్లాన్ రోజుకు 0.5GB డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 28 రోజుల చెల్లుబాటులో 14GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

జియోఫోన్ రూ 102 డేటా ప్యాక్ ప్రయోజనాలు
72 రూపాయల ధర వద్ద లభించే జియోఫోన్ డేటా ప్యాక్‌కు అదనంగా మరొక రూ.30 ఖర్చు చేస్తే కనుక 28 రోజుల పాటు రోజుకు 1GB డేటాను ఆస్వాదించవచ్చు. అంటే రూ.102 ధర వద్ద లభించే ప్లాన్ రోజువారి పరిమిత డేటాను వినియోగించే వారికి అనుగుణంగా ఉంటుంది.

జియోఫోన్ రూ 152 డేటా ప్యాక్ ప్రయోజనాలు
జియోఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా విడుదల చేసిన డేటా ప్యాక్ లలో చివరిది రూ.152 ధర వద్ద లభించే జియోఫోన్ డేటా ప్యాక్. ఇది రోజుకు 2GB డేటా ప్రయోజనంతో అదే 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అంటే ఈ ప్లాన్ మొత్తంగా 56GB డేటా ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా JioTV, JioCinema, JioSecurity మరియు JioNews వంటి అన్ని జియో యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.


Click it and Unblock the Notifications








