జియోని ఢీ కొడుతున్న ఐడియా

Written By:

టెలికం రంగంలో జియో ఫీవర్‌ని తట్టుకునేందుకు అన్ని టెల్కోలు నానా తిప్పలు పడుతున్నాయి. రిలయన్స్ జియోకి ధీటుగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వెళుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ తమ కష్టమర్లు జియో వైపు వెళ్లకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు ఈ వరసలో ఐడియా కూడా చేరింది. జియోకి పొటీగా డిజిటల్ సేవల్లోకి ఏంట్రీ ఇస్తోంది.

బ్లాక్‌బెర్రి చివరి స్మార్ట్‌ఫోన్, లాంచింగ్‌కు రెడీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పూర్తి స్థాయి డిజిటల్ సేవల్లోకి ఏంట్రీ

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కి పోటీగా ఐడియా సెల్యులార్ పూర్తి స్థాయి డిజిటల్ సేవల్లోకి ఏంట్రీ ఇస్తోంది. పూర్తి డిజిటల్ సేవల సంస్థగా మార్చే చర్యల్లో భాగంగా కొత్త యాప్‌లను లాంచ్ చేయబోతోంది.

మూవీ కంటెంట్ ను అందించేందుకు ఒప్పందాలు

సినిమాలు, టీవీ, సంగీతం, గేమ్స్ ఇలా అంతటా కొత్త యాప్‌లను త్వరలోనే ప్రారంభించబోతోంది. దీంతో పాటు మ్యూజిక్ అండ్ మూవీ కంటెంట్ ను అందించేందుకు ఒప్పందాలు చేసుకుంది.

వివిధ కేటగిరీల్లో బ్రాండెడ్ డిజిటల్ సేవలకోసం

వాల్యూ యాడెడ్ సర్వీసుల విస్తరణకు, వినోదం, సమాచారం, కమ్యూనికేషన్ అండ్ యుటిలిటీస్ లాంటి వివిధ కేటగిరీల్లో బ్రాండెడ్ డిజిటల్ సేవలకోసం ఒప్పందాలపై సంతకాలు చేసింది.

పూర్తి డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ గా

వాయిస్ కాల్స్, డాటా సర్వీసులతో పాటు తాము పూర్తి డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ గా అవతరించనున్నట్టు ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా వెల్లడించారు.

వీడియో డిమాండ్ 2020 నాటికి

భారతీయ వినియోగదారుల వినోదం, ఆన్‌లైన్ డిమాండ్‌లను నెరవేర్చే దిశగా తమ వాగ్దానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డాటా ట్రాఫిక్ లో వీడియో డిమాండ్ 2020 నాటికి 60 శాతం పెరగనున్నట్టు ఇటీవల ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఐడియా వ్యాఖ్యానించింది.

టెల్కోలన్నీ డిజిటల్ సేవలు వైపు

ఇప్పుడు టెల్కోలన్నీ డిజిటల్ సేవలు వైపు దృష్టిపెడుతున్నాయి. జియోని ఎదుర్కునేందుకు ప్రధానంగా డేటా ట్రాఫిక్ లో క్లిష్టమైన కంటెంట్ ఆఫర్స్ పై దృష్టిపెడుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Idea set to launch a slew of apps to take on Reliance Jio Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting