Reliance Jio Queue Recharge...ఒకే సారి రెండు రీఛార్జిలకు అనుమతి

|

ప్రస్తుతం ఇండియాలోని టెలికాం పరిశ్రమలో ఎప్పుడు చూడని విధంగా పలురకాల మార్పులు చోటుచేసుకున్నాయి. టెలికాం ఆపరేటర్లందరు ఆర్థికంగా నష్టపోవడం వారికి లైసెన్స్ ఫీజ్ సుమారు రూ.76 వేల కోట్లు చెల్లించమని సుప్రీం కోర్టు ఆదేశించడం ద్వారా ప్రతి ఒక్కరు టారిఫ్ చార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యాండ్‌వాగన్‌లో చేరడానికి ఒకదాని తరువాత ఒకరు తమ నిర్ణయాలను ప్రకటించారు. మూడు సంవత్సరాల ముందు తక్కువ ధరలతో మార్కెట్ లోకి వచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో కూడా ధరల పెంపును ప్రకటించింది.

జియో
 

రిలయన్స్ జియో ఇప్పటికే అవుట్గోయింగ్ కాల్స్ పై ఐయుసి ఛార్జీలను ప్రవేశపెట్టడంతో చార్జీలను ముందే పెంచింది. అయితే రాబోయే రోజుల్లో అన్ని ప్లాన్ ల ధరలు కూడా పెంచుతున్నట్లు సమాచారం. కానీ చందాదారులు ఈ ధరల పెంపు నుండి కనీసం కొంతకాలం వరకు తప్పించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది.

ప్రీపెయిడ్

రాబోయే వారాల్లో సుంకాలు పెరుగుతున్నప్పటికీ తక్కువ రేటు వద్ద ముందస్తుగా ప్రీపెయిడ్ ప్రణాళికలను పొందకుండా చందాదారులను ఆపడానికి ఏటువంటి నిబంధన లేదు. అందువల్ల రిలయన్స్ జియో యొక్క చందాదారులు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ముందుగానే రీఛార్జ్ చేయవచ్చు. దీని ద్వారా సుంకాలు పెంచిన కూడా కొంత కాలం వరకు అధిక ఖర్చుతో రీఛార్జ్ చేయడాన్ని నివారించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

టెలికాం ఆపరేటర్లకు రెండేళ్ల తాత్కాలిక నిషేదం ఇచ్చిన కేంద్రం

రీఛార్జి క్యూ ఫీచర్

రీఛార్జి క్యూ ఫీచర్

ఇప్పుడు రిలయన్స్ జియో చందాదారులను వారి రీఛార్జిలను క్యూలో ఉంచడానికి అనుమతిస్తుంది. అంటే దీని అర్థం మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తున్నపుడు దానితో పాటు మరొక రీఛార్జ్ కొనుగోలు చేయడానికి మిమ్మలిని అనుమతిస్తుంది. అంటే మీ యొక్క మొదటి రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే తదుపరిది క్యూలో ఉంటుంది. రెండవ రీఛార్జ్ కోసం మీరు అధికంగా డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక సమయంలో ప్రీపెయిడ్ రీఛార్జిని మాత్రమే ఉపయోగించుకుంటారు.

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

రిలయన్స్ జియో
 

ఇప్పుడు రిలయన్స్ జియో యొక్క ఈ లక్షణాన్ని ఉపయోగించి ప్రీపెయిడ్ చందాదారులు ధరల పెరుగుదలకు ముందు వాటిని కొనుగోలు చేయడం ద్వారా వారి రీఛార్జిలను క్యూలో ఉంచుకోవచ్చు. అలాగే వచ్చే సంవత్సరంలో వీటి యొక్క ప్రయోజనాలను ఇప్పుడున్న ధర వద్దనే ఆస్వాదించవచ్చు. ఇతర చందాదారులు అదే ప్రయోజనాల కోసం 30% లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డేటా, వాయిస్ కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు జియో సంస్థ ఏవిధంగా అందిస్తుందో అన్న దానిపై ఎటువంటి సమాచారం లేదు.

రీఛార్జ్ లను క్యూలో ఉంచడం ఎలా?

రీఛార్జ్ లను క్యూలో ఉంచడం ఎలా?

ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న రీఛార్జ్ పైన రీఛార్జ్ చేసినప్పుడు దాని గురించి మొత్తం సమాచారం మై జియో యాప్ లో లభిస్తుంది. ఇది జియోకు సంబంధించిన ప్రతిసమాచారం కనుకోవడానికి ఇది మొదటి మార్గం. మీ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మరియు వాటి ప్రయోజనాలు పూర్తిగా తెల్సుకోవచ్చు. మీ MyJio యాప్ లో మై అకౌంట్ విభాగానికి వెళ్లి ఇక్కడ "వివరాలను వీక్షించండి" బటన్‌ను నొక్కాలి. ఇప్పుడు మీరు మీ అన్ని ప్రణాళికలు మరియు రీఛార్జిలను చూడగలరు. పైన మీరు మీ ప్రస్తుత రీఛార్జ్ మరియు యాక్సిస్ చేయగల సమయం కూడా చూడగలరు.

రీఛార్జి యాక్టీవ్

తరువాత మీ తదుపరి రెండవ రీఛార్జిని యాక్టీవ్ చేయడానికి మీరు జాబితా చేయబడిన రీఛార్జ్ పక్కన ఉన్న "యాక్టివేట్" బటన్‌ను నొక్కాలి. నిర్ధారణ పాప్-అప్‌లో "నిర్ధారించండి" బటన్‌ను నొక్కండి. మీరు ఎంచుకున్న ప్లాన్ యాక్టీవ్ అయిన తర్వాత మీరు నిర్ధారణ పొందినట్లు మెసేజ్ అందుకుంటారు.

రీఛార్జ్ ప్లాన్‌ల వివరాలు

రీఛార్జ్ ప్లాన్‌ల వివరాలు

రిలయన్స్ జియో చందాదారులు ఏ రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం అనే ప్రశ్న కూడా ఉండవచ్చు. దీనికి అనువైన రీఛార్జ్ ప్లాన్‌లు ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అని మేము సిఫారస్ చేస్తున్నాము. అలాగే ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో లాంగ్ టర్మ్ ప్లాన్‌లను ఎంచుకోవడం సరైన ఎంపిక. ఆ ఆలోచనతో చూస్తే చందాదారులు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు 1,000 ఐయుసి నిమిషాలు అందించే రూ .444 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

అవుట్‌గోయింగ్ కాల్స్

ఇతర నెట్‌వర్క్‌లకు ఎక్కువ అవుట్‌గోయింగ్ కాల్స్ కోరుకునే చందాదారులకు అదే 84 రోజుల చెల్లుబాటుతో ఉన్న రూ .555 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా మంచిది. ఇది రోజుకు 2 జిబి డేటా మరియు 3,000 ఐయుసి నిమిషాలను అందిస్తుంది. ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో ఇంకా రూ.149, రూ .222, రూ .333 లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Users Can Get The Queue Recharges Plans In Advance Before Tariff Increases

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X