జియోసినిమా యాప్ లో ఉచితంగా SunNXT సినిమాలు

|

ఇటీవలి కాలంలో టెలికాం ఆపరేటర్లు అందరు టారిఫ్ ప్లాన్స్ విభాగంలో OTT సర్వీస్ లను అందిస్తున్నారు. అయితే ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో మిగిలిన టెల్కోస్ కంటే కాస్త ముందంజలో ఉంది. జియో సంస్థ లైవ్ టివి మరియు హెచ్‌డిలో కొత్త కొత్త సినిమాలు & ట్రైలర్‌లను చూడటానికి రెండు ప్రసిద్ధ జియోటివి మరియు జియో సినిమా యాప్ లను అందిస్తోంది.

JioTV
 

JioTV ప్రస్తుతం 650 కి పైగా ప్రముఖ ఛానెల్‌లను లైవ్ టివి యాప్ ద్వారా అందిస్తున్నది. అలాగే జియో సినిమా యాప్ ద్వారా సినిమాలు, టీవీ షోలు మరియు హెచ్‌డి క్వాలిటీలో తాజా ట్రైలర్‌లను చూడటానికి అనుమతిస్తుంది. తాజా సమాచారం ప్రకారం జియో సినిమా ఇప్పుడు సన్‌ఎన్‌ఎక్స్‌టి మొత్తం సినిమా కేటలాగ్‌ను అందిస్తుంది.

SunNXT

SunNXT అనేది సన్ టివి నెట్‌వర్క్ యొక్క OTT యాప్. ఇది ZEE5, అమెజాన్ ప్రైమ్ మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి వాటితో పోటీపడుతుంది. ఇతర OTT సర్వీస్ లు కూడా ఒరిజినల్ షోలను అందిస్తున్నాయి. SunNXT ప్రసార హక్కులను పొందిన కారణంగా ఇతర పంపిణీదారులు అందించే సినిమాల కంటే అధికంగా ఎక్కువ సినిమాలను చూడడానికి అనుమతిని ఇస్తుంది.

సన్‌ఎన్‌ఎక్స్‌టి మూవీ కాటలాగ్

సన్‌ఎన్‌ఎక్స్‌టి మూవీ కాటలాగ్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు జియో సినిమా ప్రత్యేకంగా లభిస్తుంది. జియో సినిమా యొక్క యాప్ ను ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లకు విడుదల చేసింది. అలాగే ఏ డెస్క్‌టాప్ లోనైనా కూడా వెబ్ వెర్షన్‌తో బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

 OTT యాప్
 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మరియు వొడాఫోన్ ప్లే వంటి వాటిని వెనుకకు నెట్టి టెల్కో యొక్క OTT యాప్ లోనూ జియో సినిమా ఇప్పటికే ఉత్తమమైన కంటెంట్‌ను కలిగి ఉంది. ఇప్పుడు సన్‌ఎన్‌ఎక్స్‌టి యొక్క మూవీ కేటలాగ్‌ను జియో సినిమాతో అనుసంధానించడంతో ఇది మరింత ఉత్తమంగా మారింది.

దక్షిణాది సినిమాలను ప్రసారం చేయడానికి

దక్షిణాది సినిమాలను ప్రసారం చేయడానికి

ప్రముఖ దక్షిణాది సినిమాలను ప్రసారం చేయడానికి సన్‌ఎన్‌ఎక్స్‌టి హక్కులను పొందింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో OTT యాప్ లలో సినిమాలు ఎక్కువగా చూడటానికి ఇష్టపడే దానిలో SunNXT ఒకటి. ఈ ఇంటిగ్రేషన్ తరువాత ఇప్పుడు జియోసినిమా మొబైల్ యాప్ మరియు వెబ్‌సైట్ లో కొత్త SunNXT సూపర్‌హిట్స్ విభాగాన్ని ప్రదర్శిస్తుంది.

SunNXT కంటెంట్‌

SunNXT కంటెంట్‌

ఇప్పుడు వినియోగదారులు జియోసినిమా OTT సర్వీస్ నుండి SunNXT కంటెంట్‌ను ఉచితంగా చూడటానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం SunNXT తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ అనే ఐదు ప్రాంతీయ భాషలలో కంటెంట్‌ను పంపిణీ చేస్తోంది. OTT సర్వీస్ సన్ టివి నెట్‌వర్క్ లిమిటెడ్ నుండి లైవ్ టివి ఛానెల్‌లను కూడా అందిస్తుంది. అయితే జియో సినిమా అనేది సినిమాలు మరియు టివి షోల కోసం మాత్రమే.

 OTT సర్వీస్

OTT సర్వీస్

ZEE5, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఇతర OTT సర్వీస్ ల మాదిరిగానే SunNXT కూడా ప్రీమియం మోడల్‌లో లభిస్తుంది. SunNXT ఒక సంవత్సరం సభ్యత్వానికి 480 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఒక నెలకు 49 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇతర OTT సర్వీస్ లతో పోలిస్తే SunNXT ఛార్జీలు తక్కువగా ఉంటాయి. రిలయన్స్ జియో కస్టమర్లు ఇప్పుడు జియో సినిమా యాప్‌లో సన్‌ఎన్‌ఎక్స్ టి కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు.

జియోసినిమాలో ప్రత్యేకమైన డిస్నీ విభాగం

జియోసినిమాలో ప్రత్యేకమైన డిస్నీ విభాగం

JioTV అప్లికేషన్ మాదిరిగానే ఫీచర్-రిచ్ మొబైల్ యాప్ లలో జియోసినిమా యాప్ కూడా ఒకటి. 2018 చివరిలో రిలయన్స్ జియో డిస్నీతో జతకట్టి జియో సినిమా యాప్ లోపల అంకితమైన డిస్నీ విభాగాన్ని ప్రారంభించింది. జియోసినిమా యాప్ లోకి లాగిన్ అయిన వెంటనే ఎంచుకోవడానికి జియోసినిమా లేదా డిస్నీ వంటి రెండు విభాగాలను ప్రదర్శిస్తుంది. ఒక వినియోగదారు డిస్నీ విభాగాన్ని ఎంచుకుంటే కనుక అప్పుడు డిస్నీకి సంబంధించిన మొత్తం కంటెంట్ చూపబడుతుంది.

క్రోమ్ కాస్ట్ మద్దతు

క్రోమ్ కాస్ట్ మద్దతు

జియోసినిమా ఆండ్రాయిడ్ యాప్ యొక్క ఇతర లక్షణాలలో క్రోమ్ కాస్ట్ మద్దతు ఒకటి. జియోసినిమా యాప్ క్రోమ్ కాస్ట్ కి మద్దతు ఇస్తుంది. ఇది క్రోమ్ కాస్ట్ మద్దతు ఉన్న స్మార్ట్ TV లో స్క్రీన్‌ను ప్రతిబింబించేలా వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ రోజుల్లో విడుదలయ్యే చాలా ఆండ్రాయిడ్ టీవీలు క్రోమ్‌కాస్ట్‌తో వస్తాయి కాబట్టి ఈ ఫీచర్ వినియోగదారులకు నిజంగా ఉపయోగపడుతుంది.

యాప్ లాగిన్

యాప్ లాగిన్

జియోసినిమా వివిధ ప్రాంతీయ భాషలలోని కంటెంట్‌ను అందిస్తుంది. వినియోగదారులు యాప్ లోకి లాగిన్ చేసేటప్పుడు వారి స్వంత భాషను ఎంచుకునే సౌలభ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. యాప్ నాణ్యమైన ఎంపిక మరియు పునప్రారంభం లక్షణాలను కూడా అందిస్తుంది. జియోసినిమా వెబ్ వెర్షన్ విషయానికొస్తే వినియోగదారులు వివిధ రకాల ఆడియో ఫార్మాట్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఎంచుకున్న శీర్షికలతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
JioCinema App Now Provides SunNXT Movie Catalogue

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X