అందుబాటులోకి జియో VoWi-Fi సర్వీస్

|

రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ మధ్య వార్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. అయితే ఈసారి VoWi-Fi సర్వీస్ యొక్క రోల్అవుట్ విభాగంలో రెండు టెల్కోలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నీవా లేక నేనా అని పోటీ పడుతున్నాయి.

 VoWi-Fi సర్వీసు

కొన్ని వారాల క్రితం ఇండియాలో భారతి ఎయిర్‌టెల్ వినియోగదారులకు VoWi-Fi సర్వీసును అందించిన మొట్టమొదటి టెల్కోగా నిలిచింది. దానికి పోటీగా వెంటనే రిలయన్స్ జియో కూడా దీనిని అనుసరించింది.

 

 

 రిలయన్స్ జియో VoWi-Fi

రోలౌట్ VoWi-Fi సర్వీసుకు సంబంధించి రిలయన్స్ జియో ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ లీకైన కొంత సమాచారం ప్రకారం ఇది కేలళ, మహారాష్ట్ర మరియు కోల్‌కతా మూడు టెలికాం సర్కిల్‌లలో రిలయన్స్ జియో వినియోగదారులందరికీ VoWi-Fi సేవను అందించింది.

ఎయిర్‌టెల్ VoWi-Fi

భారతి ఎయిర్‌టెల్ కూడా డిల్లీ NCR, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ముంబై, కోల్‌కతా సర్కిల్‌లలో VoWi-Fi సర్వీసును లేదా వై-ఫై కాలింగ్ సేవను ప్రకటించింది. వీటిని సపోర్ట్ చేసే పరికరాల విషయానికొస్తే Jio VoWi-Fi ఏదైనా VoWi-Fiను ప్రారంభించబడిన పరికరంలో పనిచేస్తుంది అని తెలిపారు.

జియో VoWi-Fi 3 సర్కిల్‌లలో ప్రారంభం

జియో VoWi-Fi 3 సర్కిల్‌లలో ప్రారంభం

భారతీయ వినియోగదారులకు VoLTE లేదా Voice over LTE టెక్నాలజీని పరిచయం ద్వారా రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయినప్పటికీ VoWi-Fi విభాగం విషయానికి వస్తే ఎయిర్టెల్ తన వై-ఫై కాలింగ్ సేవను వాణిజ్యపరంగా ప్రారంభించగలిగినందున కంపెనీ స్వల్ప తేడాతో పడిపోయింది. రిలయన్స్ జియో ఇప్పటికీ దేశంలో VoWi-Fi ప్రారంభించటానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. కాని చాలా మంది Jio కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో Jio Wi-Fi లభ్యతను గమనిస్తున్నారు. త్వరలో జియో VoWi-Fi సర్వీస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరింప చేయాలని యాజమాన్యం చూస్తున్నది.

జియో

రిలయన్స్ జియో కేరళ, మహారాష్ట్ర మరియు కోల్‌కతా అనే మూడు టెలికాం సర్కిల్‌లలో VoWi-Fi సేవలను అందించడం ప్రారంభించింది. ఇందులో ఉత్తమమైన భాగం ఏమిటంటే ఇది ఎటువంటి బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌లోనైనా పనిచేస్తుంది. ఉదాహరణకు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌కు ప్రారంభంలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎటువంటి ISP లో కూడా పనిచేస్తుంది.

Jio VoWi-Fi

Jio VoWi-Fi మద్దతు ఉన్న పరికరాల విషయానికొస్తే VoWi-Fiను ప్రారంభించిన అన్ని డివైస్లలో ఈ సర్వీస్ యొక్క మద్దతు ఉంటుంది. IOS 13.3 మరియు అంతకంటే ఎక్కువ OSతో రన్ అవుతున్న ఆపిల్ ఐఫోన్‌లకు కూడా దీని మద్దతు ఉంటుంది. వీటితో పాటుగా గెలాక్సీ M30s , గెలాక్సీ M30, గెలాక్సీ M20 వంటి శామ్‌సంగ్ ఫోన్లలో కూడా దీని మద్దతు ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్

పైన తెలిపిన మూడు సర్కిల్‌లలోని ఆపిల్ స్మార్ట్‌ఫోన్ యజమానులు జియో వై-ఫై చిహ్నాన్ని గుర్తించలేకపోతే రాబోయే రోజుల్లో మీ స్మార్ట్‌ఫోన్‌లో క్యారియర్ యొక్క అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎయిర్టెల్ వై-ఫై కాలింగ్ కు అనుకూలమైన అన్ని పరికరాలకు జియో VoWi-Fiకు మద్దతు ఉంటుంది. కాబట్టి వన్‌ప్లస్ 7T, 7 టి ప్రో, వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, రెడ్‌మి K 20 ప్రో, రెడ్‌మి K 20 తదితర స్మార్ట్‌ఫోన్ యజమానులు తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో వై-ఫై సేవను ఉపయోగించుకోగలుగుతారు.

 

 

VoWiFi ఎలా పనిచేస్తుంది

VoWiFi ఎలా పనిచేస్తుంది

మీరు పై దశలను అనుసరించిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. మీరు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వైఫై నెట్‌వర్క్‌లో ఉన్నట్లు ఫోన్ యొక్క స్టేటస్ పట్టీలో VoWiFi చిహ్నాన్ని చూపిస్తుంది. VoWiFi తో మీరు వేగంగా కాల్ కనెక్షన్ మరియు నాణ్యతను కూడా ఆశించవచ్చు.

VoWiFi సర్వీసును యాక్టివేట్ చేయడం ఎలా?

VoWiFi సర్వీసును యాక్టివేట్ చేయడం ఎలా?

స్టెప్1: ఇందులో మొదటి స్టెప్ మీ స్మార్ట్‌ఫోన్‌ను తాజా MIUI 11 వెర్షన్‌కు అప్డేట్ చేయాలి.

స్టెప్2: మీకు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండాలి.

స్టెప్3: మీ ఎయిర్‌టెల్ సిమ్‌లో VoLTE సర్వీస్ ప్రారంభించబడిందని నిర్ధారించుకోండి. దీన్ని ప్రారంభించడానికి సెట్టింగ్స్ >> సిమ్ కార్డ్ & నెట్‌వర్క్స్ >> ఎయిర్‌టెల్ సిమ్ >> యూస్ VoLTE >> ఆన్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు వైఫై కాల్ సెట్టింగులను యాక్టివేట్ చేయండి. అలా చేయడానికి సెట్టింగ్స్ >> సిమ్ కార్డ్ & నెట్‌వర్క్‌లు >> ఎయిర్‌టెల్ సిమ్ >> మేక్ కాల్స్ యూసింగ్ వైఫై >> టర్న్ ఆన్.

 

VoWiFi ఫీచర్

రిలయన్స్ జియో యొక్క VoWiFi ఫీచర్ ఇప్పుడు మహారాష్ట్ర సర్కిల్‌లోని నాసిక్ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో వినియోగదారులకు అందిస్తున్న వాయిస్ ఓవర్ వై-ఫై ఫీచర్ యొక్క స్క్రీన్ షాట్లను కూడా వినియోగదారులు షేర్ చేసారు. వినియోగదారులు షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ఆపిల్ ఫోన్ iOS కి చెందినవి కావడం గమనించదగిన విషయం. అంటే భారతి ఎయిర్‌టెల్ VoWiFi ఫీచర్ మాదిరిగానే రిలయన్స్ జియో VoWiFi కూడా ఎంచుకున్న ఫోన్‌లలో మాత్రమే లభిస్తుంది. నిర్దిష్ట ఫోన్‌లలో మాత్రమే రిలయన్స్ జియో చందాదారులు VoWiFi ని ఉపయోగించగలరు.

ఢిల్లీలో భారతి ఎయిర్‌టెల్ VoWiFi రోల్అవుట్

ఢిల్లీలో భారతి ఎయిర్‌టెల్ VoWiFi రోల్అవుట్

భారతి ఎయిర్‌టెల్ VoWiFi సర్వీసును కొద్ది రోజుల క్రితమే డిల్లీలో ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని చందాదారులు తమ ఫోన్‌లలో VoWiFi ని యాక్సెస్ చేసే అవకాశాన్ని చూసినట్లు నివేదించారు. అయితే కొన్ని ఎంచుకున్న డివైస్ లు మాత్రమే ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం డిల్లీ ప్రాంతంలో VoWiFi యాక్సెస్ ఎంపికను పొందగలిగాయి. ఆపిల్, శామ్‌సంగ్, రెడ్‌మి, వన్‌ప్లస్ సంస్థల తయారీదారుల నుంచి మొత్తంగా 24 స్మార్ట్‌ఫోన్ మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 11, వన్‌ప్లస్ 7, రెడ్‌మి కె 20 వంటి ఫోన్‌లు ఎయిర్‌టెల్ VoWiFi ఫీచర్‌తో రాబోతున్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio VoWi-Fi Service VS Airtel Wi-Fi Calling Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X