వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌తో జియోకు చెక్ పడేనా!!

|

వోడాఫోన్ ఇప్పుడు ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లపై పరిమిత కాలానికి డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ప్రీపెయిడ్ విభాగంలో రిలయన్స్ జియోకు గొప్ప ఆదరణ ఉన్నపటికీ ఒకే ఒక ప్రతికూల కదలికను తీసుకుంది. ఇది ఇటీవలి పరిచయం చేసిన IUC టాప్-అప్ వోచర్‌. భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రెండింటికీ కస్టమర్లను పెంచుకోవడానికి రిలయన్స్ జియో తనంతట తానుగా ఇప్పుడు గేట్లను తెరిచింది అని కూడా అర్థమవుతోంది.

నెట్‌వర్క్‌లు
 

జియో మాదిరిగా ఇప్పుడు ఇతర నెట్‌వర్క్‌లు వాయిస్ కాల్స్ చేయడం కోసం కస్టమర్ల నుండి అదనంగా ఏమీ వసూలు చేయరు. అవుట్గోయింగ్ వాయిస్ కాల్స్ వసూలు చేసినందుకు సోషల్ మీడియాలో రిలయన్స్ జియోను ట్రోల్ చేసిన తరువాత వోడాఫోన్ తన ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 199 మరియు రూ. 399 ల మీద డబుల్ డేటా బెనిఫిట్ ఇవ్వడం ప్రారంభించింది. వోడాఫోన్ కూడా ఈ ఆఫర్ గురించి ప్రత్యేకంగా టీజ్ చేస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మరియు డబుల్ డేటా వోడాఫోన్ ఆఫర్ కేవలం రూ.199 మరియు రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది. వీటి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఆఫర్స్

వోడాఫోన్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ ఆఫర్స్

వొడాఫోన్ అందిస్తున్న రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క డబుల్ డేటా ఆఫర్‌లో భాగంగా టెలికాం ఆపరేటర్ తన ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 84GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ముందు ఈ ప్లాన్ 1.5GB రోజు వారి డేటాను అందిస్తుండేది. కానీ ఇప్పుడు అదే ప్లాన్ 28 రోజుల వ్యవధిలో 3GB రోజువారీ డేటాతో వస్తుంది. అంటే మొత్తం డేటా ప్రయోజనం 84GBగా ఉంది.

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్

వోడాఫోన్ అందిస్తున్న మరొక ప్లాన్ రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది ముందు సాధారణంగా రోజుకు 1GB డేటాను 84 రోజుల పాటు అందిస్తుండేది. ఇప్పుడు ఈ ప్లాన్ అదే కాల వ్యవధికి రోజుకు 2 జిబి డేటాను అందిస్తుంది. అంటే మొత్తం డేటా ప్రయోజనం 168GB గా తీసుకుంటుంది. 399 రూపాయల ప్రణాళికలో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లు కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న ఈ రెండు ప్లాన్‌లను వోడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు వోడాఫోన్ మొబైల్ యాప్ మరియు మొబైల్ వెబ్‌సైట్ రెండింటిలోనూ వోడాఫోన్ ప్లే కంటెంట్‌కు యాక్సిస్ ఉచితంగా పొందుతారు.

వోడాఫోన్
 

ఇతర నెట్‌వర్క్‌లకు వలస వెళ్లాలని చూస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి వోడాఫోన్ టెలికాం ఆపరేటర్ పరిమిత కాలానికి అందిస్తున్న IUC టాప్-అప్ వోచర్‌లు. ఈ ఆఫర్ వోడాఫోన్ నుండి వస్తున్న పరిమిత కాల ఆఫర్ అని గమనించండి. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో మాకు ఖచ్చితమైన సమాచారం తెలియదు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, చెన్నై, కర్ణాటక, కేరళ మరియు ముంబై టెలికాం సర్కిళ్లలోని అందరికి ఈ ఆఫర్ లభిస్తుంది. పైన ‘సిఫార్సు చేసిన' ప్లాన్ ల విభాగం కింద అదనపు డేటాను పొందడానికి యూజర్లు తమ వోడాఫోన్ ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను వోడాఫోన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి.

డబుల్ డేటా ఆఫర్‌తో వోడాఫోన్ రిలయన్స్ జియోను అధిగమిస్తుందా

డబుల్ డేటా ఆఫర్‌తో వోడాఫోన్ రిలయన్స్ జియోను అధిగమిస్తుందా

టెలికాం ఆపరేటర్లు వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తరువాత మొదటిసారి వెళ్తున్నారు. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో 2016 లో ప్రవేశించినప్పుడు మొత్తం భారతీయ టెలికాం మార్కెట్‌ను మార్చింది మరియు ప్రస్తుత టెల్కోలను కూడా నష్టాల్లోకి నెట్టివేసింది. సరసమైన టారిఫ్ ప్లాన్‌లతో జియో కొత్త కస్టమర్ల కోసం డి-ఫాక్టో ఆపరేటర్‌గా మారింది. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క ప్రస్తుత వినియోగదారులు కూడా జియోలో పెద్ద సంఖ్యలో చేరారు. ప్రస్తుతం రిలయన్స్ జియో కఠినమైన స్థానంలో ఉంది. జియో లాభదాయకంగా మారడానికి సుంకాలను పెంచుతుందని విశ్లేషకులు ఉహించినట్లుగా టెల్కో ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్‌గోయింగ్ కాల్‌ల కోసం నిమిషానికి 6 పైసలు వసూలు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ జియో-టు-జియో నెట్‌వర్క్‌లో మరియు ల్యాండ్‌లైన్ ఫోన్‌లలో ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తున్నది.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ లతో వన్‌ప్లస్ 7 & 7ప్రో

జియో

జియో తనను మరియు దాని కొత్త IUC టాప్-అప్ వోచర్ల అమలును కాపాడుకోవడానికి ఉత్తమంగా ప్రయత్నించింది. కాని అందరు అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తున్న మరొక సరైన నెట్‌వర్క్‌ను ఎంచుకోవడానికి ప్రయత్నించడం గమనార్హం. వోడాఫోన్ నుండి వచ్చిన ఈ డబుల్ డేటా ఆఫర్ ఖచ్చితంగా రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుండి చాలా మంది వినియోగదారులను మరియు కొత్త వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ యుద్ధం ఎక్కడికి వెళుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone Rs.199 & Rs.399 Prepaid Plans Starts Providing Double Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X