Jio అపరిమిత సేవలు సంవత్సరం పాటు ఉచితం... ఈ స్మార్ట్‌ఫోన్‌ కొన్నవారికి మాత్రమే

|

ESIM టెక్నాలజీ అనేది కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇది జీవితకాలం స్మార్ట్‌ఫోన్‌లో భౌతిక సిమ్‌కు బదులుగా వర్చువల్ సిమ్‌ను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. పిక్సెల్ 4 మరియు ఐఫోన్ వంటి కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇసిమ్ మరియు ఫిజికల్ సిమ్ రెండింటి సామర్ధ్యానికి మద్దతు ఇస్తున్నప్పటికీ మోటరోలా కొత్త ఫోన్ RAZR మాత్రం ఇసిమ్‌కు మాత్రమే మద్దతును ఇస్తుంది.

 

ESIM

కేవలం ESIM కు మాత్రమే మద్దతును ఇస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇండియాలో జియో మరియు ఎయిర్‌టెల్ వంటి కొన్ని మొబైల్ ఆపరేటర్లు మాత్రమే ESIM సేవలను అందిస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మోటరోలా RAZR స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకమైన రెండు మొబైల్ కంపెనీలు దాని మొబైల్ డేటా ప్యాక్‌లలో కొన్ని ప్రత్యర్థి పోటీ ఆఫర్‌ను జాబితా చేస్తున్నాయి.

మోటరోలా RAZR ఎయిర్‌టెల్ మరియు జియో ఇసిమ్ సేవలతో

మోటరోలా RAZR ఎయిర్‌టెల్ మరియు జియో ఇసిమ్ సేవలతో

మోటరోలా RAZR ప్రమోషనల్ లాంచ్ ప్రీ-ఆర్డర్ అమ్మకంలో భాగంగా రిలయన్స్ జియో నెట్‌వర్క్ అదనంగా 1 సంవత్సరం పాటు తన అపరిమిత సేవలను ఉచితంగా అందిస్తోంది. కంపెనీ యొక్క డబుల్ డేటా బెనిఫిట్స్ వార్షిక ప్లాన్ ఆఫర్‌ను కూడా ఇందులో జాబితా చేసింది. ఇది సంవత్సరానికి అపరిమిత వాయిస్ మరియు 700GB డేటాను అందిస్తుంది. ఫలితంగా ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్‌కు చందా ఛార్జీల్లో రూ.14,997 ఆదా చేస్తుంది. అలాగే జియో మరియు ఎయిర్‌టెల్ రెండూ మోటరోలా RAZR స్మార్ట్‌ఫోన్ కోసం eSIM సేవలను అందిస్తున్నాయి.

మోటో RAZR ఫోల్డబుల్ ఫోన్ ధరల వివరాలు
 

మోటో RAZR ఫోల్డబుల్ ఫోన్ ధరల వివరాలు

మోటో RAZR ఫోల్డబుల్ ఫోన్ ఈ నెల ప్రారంభంలో ఇండియాలో రూ.1,24,999 ధర వద్ద లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2 నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అమ్మకం కానుంది. రూ.1,09,999 ల వద్ద గల శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ఈ హ్యాండ్‌సెట్ కు పోటీగా ఉంది.

మోటరోలా RAZR స్పెసిఫికేషన్స్

మోటరోలా RAZR స్పెసిఫికేషన్స్

క్విక్ రీక్యాప్ కోసం మోటరోలా RAZR ఫోల్డబుల్ ఫోన్ ఈ నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క బయట వైపు కూడా 2.7-అంగుళాల జి-ఓఎల్‌ఇడి డిస్‌ప్లేను 600 x 800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క మెయిన్ స్క్రీన్ 6.2-అంగుళాల P-OLED ఫోల్డబుల్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC మరియు అడ్రినో 640 GPU తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 2510 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది ఫ్రంట్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా మరియు ఛార్జింగ్ కోసం హ్యాండ్‌సెట్ వై-ఫై డ్యూయల్-బ్యాండ్, బ్లూటూత్ 5.0, జిపిఎస్, 4 జి ఎల్‌టిఇ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది.

కెమెరా

ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.7 ఎపర్చరు మరియు డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్‌తో కూడిన 16MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. TOF 3D డీప్ సెన్సార్ కెమెరాతో జత చేయబడి వస్తుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను f / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Jio One Year Unlimited Free Services Available With Motorola RAZR

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X