జియో మరో సంచలనం.. 93 రూపాయలకే 10 జిబి డాటా

Written By:

రిలయన్స్ కమ్యూనికేషన్ తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. రిలయన్స్ సీడీఎంఏ ఫోన్ల వినియోగదారులకు 93 రూపాయలకే 10 గిగాబైట్స్(జీబీ)తో 4జీ సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ సేవలు ముంబై, కోల్‌కతా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో వచ్చేవారం నుంచి రూ.93 నుంచి రూ.97తో లభిస్తాయని తెలిపింది. ఈ మేరకు టెలికం డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది.

Read more: రూ.4,799కే రిలయన్స్ LYF 4జీ ఫోన్

జియో మరో సంచలనం.. 93 రూపాయలకే 10 జిబి డాటా

జియో నెట్‌వర్క్ ద్వారా ఈసేవలు అందించనున్నామని, సీడీఎంఏ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. 80 లక్షల మంది రిలయన్స్ వినియోగదారుల్లో 90శాతం మంది 4జీకి మారినట్టు కంపెనీ పేర్కొంది.''రూ.93కే 10జీబీ 4జీ డాటాను అందించనున్నాం. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 94శాతం తక్కువ ధరకు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నట్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక రిలయన్స్ నుంచి 4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4 మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మీరే చూడండి.

Read more :ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్,

4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో

4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4

4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు.

కెమెరా ప్రత్యేకతలు

4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4

2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్, ప్రాసెసర్

4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4

ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

10 ప్రాంతీయ భాషలతో

4జీ వీడియో కాలింగ్ సపోర్ట్ తో LYF Flame 4

10 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 4.5 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Communications to Offer 4G at Rs. 93 for 10GB Data Using Jio's Network
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting