వైర్లెస్ ఛార్జింగ్ తో శామ్సంగ్ పవర్ బ్యాంక్
ఇండియాలో శామ్సంగ్ సంస్థ వైర్లెస్ పవర్ బ్యాంక్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ డియో ప్యాడ్ రెండు కొత్త వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ లను ప్రారంభించింది.
ఇండియాలో శామ్సంగ్ సంస్థ వైర్లెస్ పవర్ బ్యాంక్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ డియో ప్యాడ్ రెండు కొత్త వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ లను ప్రారంభించింది. ఈ రెండు Qi సర్టిఫికేట్ మరియు Qi వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్ కు మద్దతు ఇచ్చే శామ్సంగ్ మరియు నాన్-శామ్సంగ్ డివైస్ ల విస్తృత శ్రేణితో పని చేస్తాయి.

శామ్సంగ్ సంస్థ వారు వైర్లెస్ ఛార్జింగ్ మద్దతుతో పని చేసే గెలాక్సీ స్మార్ట్ఫోన్లు మరియు వాటి డివైస్ లను తయచేస్తున్నారు.

శామ్సంగ్ వైర్లెస్ పవర్ బ్యాంక్
శామ్సంగ్ వైర్లెస్ పవర్ బ్యాంక్ అంతర్నిర్మిత వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ పవర్ బ్యాంక్ గా చెప్పవచ్చు. ఇది slim అల్యూమినియం బాడీతో వస్తుంది మరియు లోపల 10,000 mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది.దీనితో ఒకే సారి రెండు డివైస్ లను ఒకటి వైర్లెస్ మరియు మరొకటి వైర్ తో ఛార్జ్ చేయవచ్చు.ఇది ఒకే సమయంలో రెండింటికి అనుకూల ఫాస్ట్ ఛార్జింగ్ మరియు క్విక్ ఛార్జ్ 2.0తో మద్దతు ఇస్తుంది

వైర్లెస్ ఛార్జర్ డియో ప్యాడ్
వైర్లెస్ ఛార్జర్ డియో ప్యాడ్ యొక్క ఒరిజినల్ డియో ప్యాడ్ చీపెర్ వెర్షన్ గత సంవత్సరం మార్కెట్ లో ప్రారంభించారు.ఇవి నిలువు ప్లేట్ కు బదులుగా రెండు హారిజాంటల్ ఛార్జింగ్ ప్లేట్లు కలిగి ఉన్న చౌకైన వేరియంట్ తో ఉంటుంది.ఇది ఒకేసారి రెండు డివైస్ లను ఛార్జ్ చేసే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్.ఇది ఫాస్ట్ ఛార్జ్2.0 కు మద్దతు ఇవ్వడంతో పాటు Qi సర్టిఫైడ్ డివైస్ తో పనిచేస్తుంది.

ధర:
శామ్సంగ్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ధర రూ.3,699( $ 50) లకే వెండి మరియు గులాబీ రంగు ఎంపికలలో లభిస్తుంది. మరోవైపు వైర్లెస్ ఛార్జర్ డియో ప్యాడ్ ధర రూ.5,999 ($ 85)లకే నలుపు మరియు తెలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది.ఇవి అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాలు మరియు శామ్సంగ్ ఇ-షాప్ అంతటా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి మరియు త్వరలోనే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లలో కూడా అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








