Home
News

భారీగా తగ్గిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల ధరలు!!! రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా...

ప్రముఖ దక్షిణ కొరియా సంస్థ శామ్‌సంగ్ ఇండియాలో ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన గెలాక్సీ A 31 స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను సంస్థ ఇప్పుడు తగ్గించింది. భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ A31 ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధరను రూ.21,999 నుంచి రూ. 20,999లకు తగ్గించింది.

గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు

గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు

ఈ 1,000 రూపాయల తగ్గింపు కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి గెలాక్సీ A31 ను కొనుగోలు చేసే వినియోగదారులకు శామ్సంగ్ సంస్థ అదనంగా రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నది.

 

శామ్‌సంగ్ గెలాక్సీ A31 సేల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ A31 సేల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ A31 స్మార్ట్‌ఫోన్ ను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులు రూ.19,999 ధర వద్ద ఫోన్ ను పొందవచ్చు. రూ.1,000 క్యాష్‌బ్యాక్ మొత్తం వినియోగదారుల యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ అకౌంటుకు జమ అవుతుంది. గెలాక్సీ A31 ను ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ మరియు ప్రిజం క్రష్ వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధర

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధర

ఇండియాలో శామ్‌సంగ్ సంస్థ యొక్క ప్రీమియం గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా శామ్‌సంగ్ సంస్థ 7 వేల వరకు ధర తగ్గింపును ప్రకటించింది. కంపెనీ దీనిని మొదట రూ.1,15,999 ధర వద్ద విడుదల చేసింది. కానీ తగ్గింపు ధర పొందిన తరువాత దీనిని రూ .1,08,999 ధర వద్ద శాశ్వతంగా విక్రయించనుంది. కంపెనీ మొదట ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్‌ను రూ.1,09,999 ధర వద్ద లాంచ్ చేసింది. అయితే తరువాత దీని ధరను రూ.1,15,999 కు పెంచింది.

శాంసంగ్ గెలాక్సీ A31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ A31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ AMOLED ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లే 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంటుంది. అలాగే దీని డిస్ ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ65 ప్రాసెసర్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది.

గెలాక్సీ A31 కెమెరా సెట్ అప్

గెలాక్సీ A31 కెమెరా సెట్ అప్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు క్వాడ్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది. ఇందులో గల మెయిన్ కెమెరా f / 2.0 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌ మరియు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా చివరిగా ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలతో క్వాడ్ రియర్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీల కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయబడి ఉంది.

గెలాక్సీ A31 సాఫ్ట్‌వేర్

గెలాక్సీ A31 సాఫ్ట్‌వేర్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్10- ఆధారిత OneUI అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇది డ్యూయల్ 4G Volte సిమ్ స్లాట్, వైఫై, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సామర్థ్యం గల 5000mAh బ్యాటరీ సపోర్ట్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A31, Galaxy Z Flip Price Slashed in India : Price, Sale Discount Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X