Home
News

Samsung Galaxy A52 & A72కొనుగోలు మీద రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు...

ప్రపంచవ్యాప్తంగా ఈ వారం ప్రారంభంలో లాంచ్ అయిన శామ్‌సంగ్ గెలాక్సీ A52, గెలాక్సీ A72 ఫోన్‌లు నిన్న భారత్‌లో లాంచ్ అయ్యాయి. వీటితో పాటు గెలాక్సీ A52 5Gని తీసుకువచ్చినప్పటికీ 5G మోడల్ భారత మార్కెట్లోకి రావడం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డస్ట్- మరియు నీటి-నిరోధకతో పాటుగా ఒక్క ఛార్జ్ మీద రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందించే విధంగా ప్యాక్ చేయబడి ఉన్నాయి. అలాగే 90HZ డిస్ప్లే, డాల్బీ అట్మోస్ మద్దతు స్టీరియో స్పీకర్లు మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి ఉండి అద్భుతమైన సేల్ ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులో ఉన్న వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52 & A72 ధరల వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ A52 & A72 ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రెండు వేరియంట్‌లలో విడుదల అయ్యాయి. వీటిలో గెలాక్సీ A52 మోడల్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.26,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 27,999 రూపాయలు. అలాగే మరొక ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ A72 యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.34,999 కలిగి ఉండగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.37,999. ఇవి బ్లాక్, బ్లూ, వైలెట్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52 & A72 లాంచ్ సేల్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A52 & A72 లాంచ్ సేల్ ఆఫర్స్

శామ్‌సంగ్ యొక్క వెబ్ సైట్ లో గెలాక్సీ A52 మరియు A72 లను కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా గెలాక్సీ A52 కొనుగోలు మీద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు డెబిట్ కార్డుల యొక్క EMI లావాదేవీలపై రూ.2,000 క్యాష్ బ్యాక్ లభించగా, గెలాక్సీ A72 ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. జెస్ట్ మనీ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు EMI లావాదేవీలపై గెలాక్సీ A72 మరియు గెలాక్సీ A52 పై వరుసగా రూ.1,500 మరియు రూ.2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. NBFC భాగస్వామ్య ప్రధాన బ్యాంకుల మీద జీరో డౌన్ పేమెంట్ మరియు ప్రాసెసింగ్ ఛార్జీలతో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్లు కూడా ఉంటాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ A52 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A52 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A52 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో వన్ UI3.1 తో రన్ అవుతుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC ను కలిగి ఉండి 8GB వరకు ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, 5-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్, మరియు మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఆండ్రాయిడ్ 11 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ A72 ఆండ్రాయిడ్ 11 ఆధారంగా వన్ యుఐ 3.1 తో రన్ అవుతూ 90HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 8GB RAM తో పాటు, ఆక్టా-కోర్ SoC చేత శక్తిని పొందుతుంది. ఆప్టిక్స్ విభాగంలో ఫోన్ వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 8 -మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ 3x ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్‌ వంటి ప్రాథమిక కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy A72, Galaxy A52 Price, Specifications And Cashback Offer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X