రూ.5,499 బడ్జెట్ ధరలో శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త ఫోన్!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్ ఇప్పుడు ఇండియాలో అత్యంత సరసమైన మరియు తక్కువ ధరలో శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ గెలాక్సీ M01 మరియు గెలాక్సీ M01 లతో పాటుగా కేవలం రూ.5,499 బడ్జెట్ ధరలో విడుదలైంది. ఈ కొత్త ఫోన్ గత వారం ఇండోనేషియాలో ప్రారంభించిన గెలాక్సీ A01 కోర్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ వలె కనిపిస్తుంది.

 

శామ్సంగ్ గెలాక్సీ M01 కోర్

శామ్సంగ్ గెలాక్సీ M01 కోర్

శామ్సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్‌ గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ గో ఆధారంగా రన్ అవుతుంది. ఇది సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉండి రెండు వేరు వేరు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: ఇండియాలో మరో 47 చైనా యాప్‌లపై నిషేదం!! PUBG ఇక లేనట్లే...Also Read: ఇండియాలో మరో 47 చైనా యాప్‌లపై నిషేదం!! PUBG ఇక లేనట్లే...

శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ ధరల వివరాలు
 

శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ ధరల వివరాలు

ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో1GB ర్యామ్ + 16GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.5,499 కాగా 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.6,499. ఇది బ్లాక్, బ్లూ మరియు రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు జూలై 29 బుధవారం నుండి సామ్‌సంగ్ రిటైల్ దుకాణాలు మరియు శామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా మొదలుకానున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్పెసిఫికేషన్స్

గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ నానో స్లాట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ గోలో క్వాడ్-కోర్ మీడియాటెక్ 6739 SoC మరియు వన్ UI తో రన్ అవుతుంది. ఇది 5.3-అంగుళాల PLS డిస్ప్లే ప్యానల్‌ను HD + డిస్ప్లే రిజల్యూషన్ మరియు 18.5: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైభాగంలో మరియు దిగువ భాగంలో మందపాటి బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ MT6739 SoC తో రన్ అవుతూ 1GB RAM మరియు 2GB ర్యామ్ లతో జతచేయబడి ఉంటుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ ఎంపికతో మెమొరీని మరింత విస్తరించవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ సింగిల్ కెమెరా సెటప్

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ సింగిల్ కెమెరా సెటప్

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో ఫోటోలు మరియు వీడియో గ్రఫీ కోసం 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది LED ఫ్లాష్ యూనిట్‌తో జతచేయబడి వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ 3,000mAh బ్యాటరీ

సామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ 3,000mAh బ్యాటరీ

గెలాక్సీ A01 కోర్ మాదిరిగానే శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్‌ఫోన్ కూడా 3,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 11 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని సంస్థ పేర్కొంది. ఇతర లక్షణాలలో హైబ్రిడ్ సిమ్ స్లాట్‌తో పాటు 3.5mm ఆడియో సాకెట్ ను కలిగి ఉండి ఇది కేవలం 8.6mm మందంతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M01 Core Entry-level Smartphone With Android Go, 3000mAh Battery Launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X