ఫిదా అయే ఆఫర్లతో శామ్సంగ్ గెలాక్సీ M30

|

శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ స్మార్ట్ ఫోన్లలో టాప్ లో ఉన్న శామ్సంగ్ గెలాక్సీ M30 మళ్లీ అమెజాన్ ఇండియా మరియు శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్ల లో విక్రయించటానికి సిద్ధంగా ఉంది. శ్యామ్సంగ్ గాలక్సీ M30 అనేది ఈ ఏడాది శామ్సంగ్ తన మిడ్-రేంజ్ బడ్జెట్ లో భాగంగా గెలాక్సీ M సిరీస్ లో ఈ సంవత్సరం ప్రారంభించిన మూడవ స్మార్ట్ ఫోన్.

ఫిదా అయే ఆఫర్లతో శామ్సంగ్ గెలాక్సీ M30

 

శామ్సంగ్ గెలాక్సీ M10, గెలాక్సీ M20, గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్లలో శ్యామ్సంగ్ గెలాక్సీ M30 ఆన్లైన్ విక్రయానికి పరిమితం కాగా మిగిలినవి ఆఫ్ లైన్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

 ఫ్లాష్ అమ్మకం

ఫ్లాష్ అమ్మకం

వాస్తవానికి గెలాక్సీ M10 మరియు గెలాక్సీ M20 రెండూ కూడా ఆన్లైన్ లో బహిరంగ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.గెలాక్సీ M30 కొనుగోలు పరిమిత సమయం ఫ్లాష్ అమ్మకం కోసం వేచిఉండవలసిన అవసరం లేదు అంటే ఆసక్తి గల కొనుగోలుదారులు ప్రయత్నించవచ్చు. ఫ్లాష్ అమ్మకంలో భాగంగా ఆసక్తి కొనుగోలుదారులు 12:00 PM వద్ద అమెజాన్ ఇండియా లేదా శామ్సంగ్ ఆన్లైన్ స్టోర్లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విక్రయంలో భాగంగా 4 GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 6 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి రెండు వైవిధ్యాలలో లభిస్తాయి.

ధర:

ధర:

4 GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.14,990లు మరియు రెండవది 6 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,990లు.ఈ రెండు డివైస్ లు గ్రాడ్యుయేషన్ బ్లాక్ మరియు గ్రాడ్యుయేషన్ బ్లూ రంగులలో అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్స్ :
 

ఆఫర్స్ :

అందుబాటులో ఉన్న ఫీచర్లు దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు నో-కాస్ట్ EMI ఎంపికను ఎంచుకోవచ్చు.అవి ఒక్కొక్కటిగా స్మార్ట్ఫోన్ మొత్తం చెల్లించటానికి ఇష్టపడకపోతే అమెజాన్ ఇండియాలో 1,119 రూపాయలకు ప్రొటెక్షన్ ప్రణాళికను పొందవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుతో రూ.3,110 విలువ గల "జీయో గాలక్సీ క్లబ్" డబుల్ డేటా ఆఫర్ను పొందవచ్చు.అయితే ఇది రూ. 198 మరియు రూ. 299 నెలవారీ ప్రణాళికల్లో మాత్రమే లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

శామ్సంగ్ గెలాక్సీM30 6.4-inch ఫుల్-HD + (1080x2340 పిక్సెల్స్) ఇన్ఫినిటీ- V డిస్ప్లే తో పాటు 19.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది.ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయోని శామ్సంగ్ ఎక్స్పీరియన్స్ V9.5 ఆధారంగా నిర్వహిస్తుంది,మరియు డ్యూయల్ సిమ్ (నానో),Exynos 7904 SoC శక్తితో పని చేస్తుంది. ఇది 4GB మరియు 6GB RAM ఎంపికలతో వస్తుంది.

ఇమేజెస్ మరియు వీడియోల కోసం వెనుక వైపు 13-మెగాపిక్సెల్ f / 1.9 ఎపర్చర్ ప్రైమరీ సెన్సార్ మరియు 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మరియు 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.ముందు వైపు f / 2.0 ఎపర్చరుతో 16-మెగాపిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

గెలాక్సీ M30 64GB మరియు 128GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వస్తుంది. ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఇది USB టైప్-సి ద్వారా వేగంగా ఛార్జింగ్ కు మద్దతిస్తుంది.

* డిస్ప్లే ------ 6.4-inch

* ప్రాసెసర్ ------ శామ్సంగ్ Exynos 7904

* ఫ్రంట్ కెమెరా ------ 16-మెగాపిక్సల్

* రెసొల్యూషన్స్ ------- 1080x2340 pixels

* RAM ------- 4GB/6GB

* OS ------- ఆండ్రాయిడ్ 8.1ఒరియా

* స్టోరేజీ -------- 64GB/128GB

* బ్యాక్ కెమెరా -------- 13-మెగాపిక్సల్ + 5-మెగాపిక్సల్+5-మెగాపిక్సల్

* బ్యాటరీ -------- 5000mAh

Most Read Articles
Best Mobiles in India

English summary
samsung galaxy m30 sale at 12pm today price specifications offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more