Home
News

Samsung Galaxy S20 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.16,000 భారీ ధర తగ్గింపు...

ఇండియాలో దక్షిణ కొరియా సంస్థకు చెందిన శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. సంస్థ యొక్క గెలాక్సీ S20 సిరీస్ ఫోన్ల ధరలు గెలాక్సీ S21 సిరీస్ కంటే తక్కువ ధరను అందుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇప్పుడు గెలాక్సీ S20, గెలాక్సీ S20 +, గెలాక్సీ S20 అల్ట్రా యొక్క ధరల మీద సుమారు రూ.15,991 వరకు ధరను తగ్గించింది. అయితే గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్ల యొక్క ధరలను సంస్థ తగ్గించలేదు. ఈ సంస్థ ఇప్పుడు గెలాక్సీ S21 సిరీస్‌ను లాంచ్ చేయనున్నది. వీటిని కూడా శామ్సంగ్ సంస్థ గెలాక్సీ S21, S21 + మరియు S21 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లుగా విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy S20 Series స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపు

Samsung Galaxy S20 Series స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపు

ఇండియాలోని మొబైల్ మార్కెట్‌లో గెలాక్సీ S20 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపును అందించడం ప్రారంభించింది. ఇందులో ఇంతకు ముందు రూ.59,499 ధర వద్ద లభించే గెలాక్సీ S20 ఫోన్ మీద ధర తగ్గింపు పొందిన తరువాత ఇప్పుడు రూ.49,999 కు తగ్గించబడింది. అంటే దీనిని మీద రూ.10,000 వరకు తగ్గింపు లభించింది. అలాగే గెలాక్సీ S20 + స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను 72,990 రూపాయల నుండి 56,999 రూపాయలకు తగ్గించారు. అంటే గాలక్సీ S20 + మీద సుమారు రూ.15,991 వరకు ధర తగ్గింపు లభించింది.

గెలాక్సీ S20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు వివరాలు

గెలాక్సీ S20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు వివరాలు

గెలాక్సీ S20 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో చివరిది గెలాక్సీ S20 అల్ట్రా యొక్క ధరను రూ.86,999 అసలు ధర నుండి ఇప్పుడు 76,999 రూపాయలకు తగ్గించారు. ఈ కొత్త ధరలతో ఆఫ్‌లైన్ స్టోర్లలో వీటిని పొందవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ ఎస్ 20 + ను రూ.54,999 ధర వద్ద విక్రయిస్తుండగా, గెలాక్సీ ఎస్ 20, S20 అల్ట్రా ఫోన్లు స్టాక్ అయిపోయినట్లు చూపుడుతున్నాయి. శామ్సంగ్ యొక్క అధికారిక దుకాణాలలో ఇప్పటికీ ఈ మూడు ఫోన్‌లను పాత ధరల వద్ద విక్రయిస్తోంది. అయితే గెలాక్సీ S21 ఫోన్లు అధికారికంగా విడుదలైన తరువాత వీటి ధరలు మారుతాయని భావిస్తున్నారు.

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క 6.7-అంగుళాల డైనమిక్ అమోలెడ్ HD డిస్‌ప్లే 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి మరియు 1440 × 3200 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ మరియు శామ్‌సంగ్ యొక్క సొంత ఎక్సినోస్ 990 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ అల్ట్రావైడ్ కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ అల్ట్రావైడ్ కెమెరా ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S20 సిరీస్ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సెన్సార్ తో ప్రైమరీ కెమెరా మరియు 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా f / 2.2 సెన్సార్ తో కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S20 Series Price Slashed in India Up to Rs 15,991
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X