2021లో లాంచ్ చేయనున్న Samsung కొత్త స్మార్ట్ టీవీల ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి..

|

శామ్సంగ్ సంస్థ 2021 సంవత్సరంలో తన యొక్క మార్కెట్ ను మరింత విస్తరించుకునే పనిలో భాగంగా తన యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ టీవీలను 2021 లో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్ టీవీలు 'నియో క్యూఎల్‌ఈడీ టీవీ' మరియు 'మైక్రోలెడ్ టీవీ' రెండు కూడా మెరుగైన బ్యాక్‌లైటింగ్, మెరుగైన కాంట్రాస్ట్‌, సైన్ లాంగ్వేజ్ జూమ్ మరియు మల్టీ-అవుట్పుట్ ఆడియో వంటి మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా శామ్సంగ్ తన కొత్త 'ది ఫ్రేమ్ టీవీ'ను కూడా ప్రకటించింది. ఇది ఈ సంవత్సరం మెరుగైన ఫీచర్లతో అతి సన్నని రూపంలో రాబోతున్నది. ఈ స్మార్ట్ టీవీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Neo QLED TV ఫీచర్స్
 

Samsung Neo QLED TV ఫీచర్స్

శామ్సంగ్ నియో QLED టివి 8K మరియు 4K ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నది. ఈ స్మార్ట్ టీవీ క్వాంటం మినీ ఎల్‌ఈడీని ఉపయోగిస్తుంది. నియో క్యూఎల్‌ఇడి టివి శామ్‌సంగ్ యొక్క క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ మరియు నెక్స్ట్-జెన్ లైట్ సోర్స్ వంటి ఫీచర్లను ఉపయోగిస్తుంది. దీని డిస్ప్లే వెనుక ఉన్న LED లు ఖచ్చితమైన నియంత్రణతో సమతుల్య లైటింగ్‌ను అందిస్తుంది. క్వాంటం మినీ LED, మరియు క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ స్మార్ట్ టీవీని 4,096 దశల్లో బ్రైట్ నెస్ స్కేల్‌ను 12-బిట్‌ వరకు పెంచడానికి అనుమతిస్తుంది. ఇది మెరుగైన HDR అనుభవానికి దారితీస్తుంది. ఈ నియో క్యూఎల్‌ఇడి టివిలు బెజెల్-లెస్ డిజైన్‌తో మరియు స్లిమ్‌గా లభించే అవకాశం ఉంది. ఆడియో విభాగంలో స్మార్ట్ టీవీ అధునాతన సౌండ్ టెక్నాలజీతో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రోతో వస్తుంది. శామ్సంగ్ హెల్త్ మరియు సూపర్ అల్ట్రావైడ్ గేమ్ వ్యూ ఫీచర్లు కూడా స్మార్ట్ టీవీలో ముందే లోడ్ చేయబడతాయి.

Samsung MicroLED TV ఫీచర్స్

Samsung MicroLED TV ఫీచర్స్

శామ్సంగ్ మైక్రోలెడ్ టీవీలు 110 మరియు 99-అంగుళాల రెండు వేర్వేరు పరిమాణాలలో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్ టీవీ 24 మిలియన్ల వ్యక్తిగత నియంత్రిత మైక్రోమీటర్-సైజ్డ్ LED లైట్లతో వస్తుంది. ఇది వినియోగదారులకు గొప్ప వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది వినియోగదారులకు 99% స్క్రీన్-టు-బాడీ రేషియో డిస్ప్లేని అందిస్తుంది. మెజెస్టిక్ సౌండ్‌కు మద్దతు, 5.1 ఛానల్-ఆడియో అవుట్‌పుట్ ద్వారా బాహ్య స్పీకర్ల అవసరం లేని సౌండ్ అనుభవాన్ని తీసుకురానున్నది.

Samsung The Frame 2021 ఫీచర్స్

Samsung The Frame 2021 ఫీచర్స్

శామ్సంగ్ సంస్థ కొత్తగా ‘ది ఫ్రేమ్ 2021' వెర్షన్‌ను కూడా ప్రకటించింది. ఇది మునుపటి మోడల్ కంటే సన్నగా ఉంటుంది. దీనిని గోడకు అమర్చినప్పుడు చూడడానికి సాంప్రదాయ ఫోటో ఫ్రేమ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. వివిధ కస్టమైజేషన్ మరియు కలర్ ఆప్షన్లతో ఐదు వేర్వేరు అటాచ్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది. శామ్సంగ్ 2017 నుండి మిలియన్ యూనిట్లకు పైగా ‘ది ఫ్రేమ్' టీవీని విక్రయించిందని సంస్థ పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Plan to Launch Neo QLED, MicroLED and The Frame TVs in This Year 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X