రూ.10000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ సేల్!!!
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా, శామ్‌సంగ్ గెలాక్సీ S21 +, శామ్‌సంగ్ గెలాక్సీ S21, మరియు శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లు ఇప్పుడు ఓపెన్ సేల్ పద్దతిలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఇవి అద్బుతమైన క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్‌లతో ప్రముఖ ఇ-కామర్స్ సైట్లలో జాబితా చేయబడతాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లభించే శామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ ధరల వివరాలు
టాప్-ఆఫ్-ది-లైన్ లో లభించే సామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా యొక్క 12GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.1,05,999 కాగా టాప్-ఎండ్ మోడల్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.1,16,999. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ S21 + యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ. 81,999 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.85,999గా ఉంది. చివరగా శామ్‌సంగ్ గెలాక్సీ S21 యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.69,999 ధర వద్ద లభిస్తుండగా 256GB స్టోరేజ్ ఆప్షన్ ను రూ.73,999 ధర వద్ద పొందవచ్చు.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ సేల్స్ వివరాలు
సామ్‌సంగ్ యొక్క ఈ మూడు ఫోన్‌లను శామ్‌సంగ్.కామ్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్ లతో పాటుగా శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ మరియు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కూడా ఈ రోజు నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ గ్రే, ఫాంటమ్ పింక్, ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ వైలెట్ మరియు ఫాంటమ్ వైట్ అనే ఆరు వేరు వేరు కలర్ లలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 +, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 లభిస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ S21 సిరీస్ కొనుగోలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
ప్రస్తుత అమ్మకపు ఆఫర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రాపై రూ. 10,000 వరకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 + పై రూ.7,000 వరకు మరియు శామ్‌సంగ్ గెలాక్సీ S21 కొనుగోలు మీద రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. శామ్‌సంగ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగదారులకు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసినప్పుడు తగ్గింపు ఆఫర్లు కూడా అదనంగా ఉన్నాయి.

గెలాక్సీ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ ధరలు & సేల్ వివరాలు
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ 15,990 రూపాయల ధర వద్ద నుండి లభిస్తుంది. ఈ రోజు నుండి వీటిని సామ్‌సంగ్.కామ్, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్ మరియు శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు బ్లాక్, వైలెట్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications







