యాపిల్ ఎఫెక్ట్: సామ్‌సంగ్ టాబ్లెట్ పై 6,000 తగ్గింపు!

Posted By: Super

యాపిల్ ఎఫెక్ట్: సామ్‌సంగ్ టాబ్లెట్ పై 6,000 తగ్గింపు!

 

సౌత్‌కొరియన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ 10.1 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన టాబ్లెట్  ‘గెలాక్సీ టాబ్2’ 20శాతం ధర రాయితీని అందుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ వెల్లడించిన వివరాల మేరకు సామ్‌సంగ్  తన ‘గెలాక్సీ టాబ్2 10.1’ ధరను  రూ.31,990  నుంచి రూ.25,900కు తగ్గించింది. ధర తగ్గింపు నేపధ్యంలో ఈ కోనుగోలు పై ప్రతీ యూజర్ రూ.6090వరకు ఆదా చేసుకోవచ్చు.

రూమర్: భవిష్యత్ వ్యూహంలో మెగా ఫ్యామిలీ?

ఇప్యాడ్ మినీ ఆవిష్కరణను దృష్టిలో ఉంచుకునే..?

భారత్‌లో యాపిల్ ఐప్యాడ్ మినీ ఇంకా ఐప్యాడ్4 అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపధ్యంలో సామ్‌సంగ్ ఈ ధర తగ్గింపు వ్యూహాన్ని అమలు చేసినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్2 10.1 స్పెసిఫికేషన్‌లు:

- 10 అంగుళాల టచ్‌స్ర్కీన్,

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,

- డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,

- 1జీబి ర్యామ్,

- 3మెగాపిక్సల్ రేర్ కెమెరా,

- వీజీఏ ఫ్రంట్ కెమెరా,

- హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

- వై-ఫై, బ్లూటూత్ వీ3.0, యూఎస్బీ 2.0,

- డిజిటల్ కంపాస్,

- మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

- మ్యూజిక్ ప్లేయర్ (సౌండ్ ఎలైవ్),

- పొలారిస్ డాక్యుమెంట్ ఎడిటర్,

- సామ్‌సంగ్ అప్లికేషన్స్,

- సామ్‌సంగ్ టచ్‌విజ్, లైవ్ ప్యానల్ యాక్సిస్,

- స్టాండర్డ్ లియోన్ 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

- హెచ్‌ఎస్‌పీఏ+ 21ఎంబీపీఎస్ 850/900/1900/2100

- యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్, లైట్ సెన్సార్.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot