బెంగళూరులో సామ్‌సంగ్ మొబైల్ చార్జింగ్ స్టేషన్‌లు

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ గార్డెన్ సిటీ బెంగళూరులో ఉచిత సోలార్ పవర్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌కేఫ్‌ల బయట ఈ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు సామ్‌సంగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

Read More : ఫోన్‌లకు ఎబోలా అంటూ అలజడి

ఈ మొబైల్ చార్జింగ్ సదుపాయాలను వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. భారత్‌లో ఈ తరహా సోలార్ ఆధారిత మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయటం ఇదే ప్రప్రధమమని సామ్‌సంగ్ తెలిపింది.

Read More : లాడెన్ టేపుల్లో షాకింగ్ విషయాలు

300KW సోలార్ పవర్ కెపాసిటీని కలిగి ఉండే ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్‌ల ద్వారా రోజుకు 20 మొబైల్ ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. నగరంలోని సీఎమ్‌హెచ్ రోడ్, ఇందిరానగర్, టోటల్ మాల్, సార్జాపురా రోడ్, సహకార్ నగర్, మల్లేశ్వరం ఇంకా విజయనగర్ ప్రాంతాల్లో ఈ మొబైల్ ఛార్జింగ్ హబ్‌‍లను సామ్‌సంగ్ ఏర్పాటు చేసింది.

English summary
Samsung Unveils Free Solar-Based Mobile Charging Facilities in Bengaluru. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot