సంగీతా మొబైల్స్ సెన్సేషనల్ ఆఫర్స్

Posted By:

ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సంగీతా మొబైల్స్ తన 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ల పై ఉత్సాహాకర ఆఫర్లను ప్రకటించింది. రూ.1 అంతకన్నా ఎక్కువ మార్జిన్ సేల్ పై 20 శాతం క్యాష్ బ్యాక్, లక్ష సెకన్ల టాక్‌టైమ్ కలిగిన సిమ్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్ బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ కార్దుదారులకు 2,000 రివార్డు పాయింట్లు వంటి ఆసక్తికర డీల్స్‌ను అందుబాటులో ఉంచినట్లు సంగీతా మొబైల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

(చదవండి: పిల్లలు కాదు పిడుగులు)

 సంగీతా మొబైల్స్ సెన్సేషనల్ ఆఫర్స్

వీటితో పాటు తమ వద్ద కొనుగోలు చేసే ఉత్పత్తుల పై జీరో వడ్డీతో కూడిన ఈఎమ్ఐ సౌకర్యం, బజాజ్ ఫైనాన్స్ నుంచి 100 శాతం వరకు మనీబ్యాక్, రూ.లక్ష వ్యక్తిగత ఇన్సూరెన్స్, వారం రోజుల రిప్లేస్‌మెంట్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లు సంగీతా మొబైల్స్ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తాయి.

(చదవండి: వెతికింది వీరికోసమే!)

సంగీతా మొబైల్స్ అందిస్తోన్న ఆఫర్లు యాపిల్, సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీ, మైక్రోసాఫ్ట్, ఎల్‌జీ , లెనోవో, డెల్, మైక్రోమాక్స్, కార్బన్, లావా, ఇంటెక్స్, వైవో ఇంకా వామ్ మొబైల్ బ్రాండ్‌లకు వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకా, తమిళనాడు రాష్ట్రాల్లోని సంగీతా స్టోర్‌లలో జూలై 4, 2015 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు సంస్థ తెలిపింది.

English summary
Sangeetha Celebrates 41st Anniversary with Sensational Offers.Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot