మైక్రోసాఫ్ట్ సీఈఓ జీతం రూ.520 కోట్లు

Posted By:

మైక్రోసాఫ్ట్ సీఈఓ జీతం రూ.520 కోట్లు

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు వార్షిక వేతనం క్రింద 8.4 కోట్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.520 కోట్లు) చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ షేర్ హోల్డర్లు అంగీకరించారు. అయితే, ఈ వేతనం అధికంగా ఉందంటూ పలువురు వాటాదారుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకపోయింది.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

ఇంజనీర్లకు యాపిల్ చెల్లిస్తోన్న జీతాలు!

మైక్రోసాప్ట్ ఎగ్జిక్యూటివ్ పే ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన అడ్వైజరీ ఓటింగ్‌లో 72 శాతం మంది పైగా సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీని అమోదించారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓగా సత్య నాదెళ్ల గుర్తింపు పొందారు. సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరి 4వ తేదీన మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంత క్రితం ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Satya Nadella to get $84 million pay package. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot