దొంగను పట్టించిన సెల్ఫీ వీడియో!
దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ఆ ఇంట్లో ఓ స్టాండ్ పై అమర్చిన ఐఫోన్ ద్వారా వీడియో తీసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లాస్‌ఏంజిల్స్‌లోని పలోమా అవెన్యూలో జూలై 11వ తేదీన ఓ ఇంట్లోకి అంతకుడు చొరబడ్డాడు.

Read More: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్
ఇల్లాంతా గాలిస్తున్న అతనికి స్టాండ్ పై అమర్చిన ఓ ఐఫోన్ కనిపించింది. వెంటనే ఆ ఫోన్ను అందుకుని స్ర్కీన్ వైపు చూస్తుండగా వెంటనే వీడియో అప్లికేషన్ ఆన్ అయి అతనికి తెలియకుండానే అతడి వీడియోను రికార్డ్ చేసేసింది. అనంతరం ఐఫోన్తో సహా దొండ అక్కడ నుంచి పరారయ్యాడు.
Read More: ఈ విల్లాను మూడు గంటల్లో కట్టేసారు!
ఐఫోన్ ద్వారా దొంగ వీడియో తీసుకోవటాన్ని గమనించిన ఇంటి యజమాని తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన Presence అనే సెక్యూరిటీ రిమోట్ అప్లికేషన్ ద్వారా ఆ వీడియోను పోలీసులకు చూపించారు. ఈ వీడియో ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకని డెటిక్టివ్ బృందంతో పాటు లాస్‌ఏంజిల్స్ పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.


Click it and Unblock the Notifications








