Home
News

Gmail లో ఈ-మెయిల్స్‌ను వెనక్కి తీసుకోవడం ఎలా.. పొరపాటున పంపినా, చదవకముందే తొలగించండిలా..!

Wrong Email: జీమెయిల్ అనేది గూగుల్ సంస్థ తయారుచేసిన ఒక ఉపయోగకరమైన ఈమెయిల్ సర్వీసు. చాలా సులువుగా వాడుకునేలా ఉంటుంది, స్పామ్ మెయిల్స్‌ను అస్సలు రానివ్వదు. అంతేకాదు, గూగుల్ డ్రైవ్, క్యాలెండర్, కాంటాక్ట్స్ లాంటి ఇతర గూగుల్ సర్వీసులతో కలిసి పనిచేస్తుంది. 15GB ఉచిత స్టోరేజ్, మనకు నచ్చినట్టు మార్చుకునే సెట్టింగ్స్, వెతకడానికి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఉండటంతో, జీమెయిల్ వ్యక్తిగతమైన పనులకే కాదు.

ఆఫీస్ పనులకు కూడా చాలా ఈజీగా, సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఇందులో ఒక ఫీచర్ ఉపయోగించి ఈమెయిల్ పంపిన తర్వాత కూడా దాన్ని అవతల వ్యక్తికి చేరకుండా ఆపవచ్చు. ఒక్కోసారి తొందరలో మెయిల్ పంపి తప్పులు గుర్తుకొస్తాయి, లేదా ఎవరికో పొరపాటున పంపేస్తాం.

Sent the Wrong Email  Here How to Undo Send in Gmail

అలాంటి సమయంలో జీమెయిల్ (Gmail)లోని "Undo Send (అన్‌డు సెండ్)" ఆప్షన్ చాలా తలనొప్పులు ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడుతుంది. మనం సెట్ చేసుకున్న సమయం లోపల మెయిల్ అవతలి వ్యక్తికి వెళ్లకుండా ఆపగలం. ఆ తర్వాత ఎలాంటి ఆందోళన లేకుండా, తప్పులు సరిచేసుకొని, మళ్లీ పంపే అవకాశం ఉంటుంది.

ఈ ఆర్టికల్‌లో, జీమెయిల్‌లో "అన్‌డు సెండ్" ఫీచర్ ఉపయోగించి ఈమెయిల్‌ను ఎలా వెనక్కి తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ స్టెప్స్ ఫాలో అయితే, మీరు ఈజీగా జీమెయిల్‌లో మెయిల్స్‌ను అవతలి వ్యక్తికి చేరకుండా ఆపడం ఎలాగో నేర్చుకుంటారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, మెయిల్ అవతలి వాళ్లకి చేరేలోపు ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు.

* జీమెయిల్ అన్‌డు (Undo) సెండ్ ఫీచర్ అంటే..

జీమెయిల్‌లోని "అన్‌డు సెండ్" ఫీచర్ అంటే, మీరు సెండ్ బటన్ నొక్కిన కొద్దిసేపటి వరకు ఈమెయిల్‌ను అవతలి వ్యక్తికి చేరకుండా ఆపవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ఈమెయిల్ పంపిన వెంటనే, జీమెయిల్ విండోలో కింద "మెసేజ్ సెంట్" అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది.

దాంతో పాటే "అన్‌డు" అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. పొరపాటు చేసినా, లేదా మెయిల్ సరిగ్గా రాయకుండానే పంపినా, ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. వెంటనే "అన్‌డు" ఆప్షన్‌పై నొక్కితే, మెయిల్ అవతలి వ్యక్తికి వెళ్లకుండా ఆగిపోతుంది. దీంతో చాలా ఇబ్బందులు తొలగిపోతాయి.

* డెస్క్‌టాప్‌లో ఎలా..

డెస్క్‌టాప్‌లో జీమెయిల్ నుంచి ఈమెయిల్‌ను అన్‌సెండ్ చేయడం చాలా సులభం. కానీ, సమయం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలోగా అన్‌డు ఆప్షన్ పైన క్లిక్ చేయకపోతే ఇక ఆ ఈ-మెయిల్ అవతలి వ్యక్తి చేరకుండా ఆపే అవకాశమే ఉండదు. మరి తక్కువ సమయంలో ఎలా చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం.

స్టెప్ 1: మీ కంప్యూటర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి, ఎవరికైనా ఒక ఈమెయిల్ పంపండి. మీరు మెయిల్ పంపిన వెంటనే, మీ ఇన్‌బాక్స్ కింద చిన్నగా ఒక పాప్-అప్ కనిపిస్తుంది. ఆ పాప్-అప్‌లో "అన్‌డు" అనే ఆప్షన్ ఉంటుంది. ఈమెయిల్‌ను వెనక్కి తీసుకోవడానికి దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే, పంపిన మెయిల్ డ్రాఫ్ట్ రూపంలో ఓపెన్ అవుతుంది.

స్టెప్ 2: ఇప్పుడు మీరు మెయిల్‌లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు, లేదా ఇంకేమైనా మార్పులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అన్నీ సరిచేశాక, మళ్లీ "సెండ్" బటన్ క్లిక్ చేసి, కరెక్ట్ చేసిన ఈమెయిల్‌ను పంపాలి. అంతే మీరు పంపిన ఈమెయిల్ అవతలి వ్యక్తికి చేరకుండానే ఆగిపోతుంది .

* మొబైల్ యాప్‌లో ఎలా..

మొబైల్ యాప్‌లోనూ జీమెయిల్ నుంచి మెయిల్ వెనక్కి తీసుకోవడం డెస్క్‌టాప్ లాగే ఉంటుంది. కొత్త మెయిల్ రాసి పంపిన వెంటనే, స్క్రీన్ కింద ఒక చిన్న బాక్స్ వస్తుంది. అందులోనే మీకు అన్‌డు లేదా వెనక్కి తీసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. జీమెయిల్ యాప్‌లో ఈమెయిల్‌ను ఎలా అన్‌సెండ్ చేయాలో సింపుల్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి.

స్టెప్ 1: జీమెయిల్ యాప్‌కు వెళ్లి, ఎవరికైనా ఈమెయిల్ రాయండి. మీరు ఈమెయిల్ పంపగానే, వెంటనే "అన్‌డు" బటన్‌తో ఒక పాప్-అప్ కనిపిస్తుంది. ' అన్‌డు'పై నొక్కి తప్పులు సరిచేసుకోండి డెస్క్‌టాప్‌లో చెప్పినట్టే, "అన్‌డు"పై నొక్కాలి.

స్టెప్ 2: మెయిల్‌లో తప్పులు సరిచేసుకోవాలి. మళ్ళీ సెండ్ చేయాలి. మెయిల్ అన్‌డు చేశాక, మళ్లీ మెయిల్ సరిగ్గా రాసుకొని, సెండ్ చేయాలి. తద్వారా ఈమెయిల్ అనేది అవతలి వ్యక్తి చేరకుండా ఆపవచ్చు. ఈ ఫీచర్ తో చాలా సమయం, తలనొప్పులు తగ్గుతాయి.

* ఐఫోన్ లో ఎలా..

ఐఫోన్‌లో కూడా ఈ-మెయిల్ వెనక్కి తీసుకోవడం ఆండ్రాయిడ్ లాగే ఉంటుంది. కానీ, కొంచెం తేడా ఉంటుంది అంతే. ఐఫోన్ లో జీమెయిల్ ఉపయోగించి ఈమెయిల్‌ను ఎలా రద్దు చేయాలో చూద్దాం. జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. అందుకు ఐఫోన్ లో జీమెయిల్ యాప్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి.

కింద కుడివైపున "కంపోజ్" బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఈమెయిల్ రాయండి, ఎవరికో ఒకరికి పంపండి. మెయిల్ పంపిన వెంటనే, కింది భాగంలో "Undo" బటన్ కనిపిస్తుంది. మెయిల్ వెనక్కి తీసుకోవాలంటే వెంటనే దానిపై క్లిక్ చేయండి. అంతే, మీరు సక్సెస్‌ఫుల్‌గా ఈమెయిల్‌ను అన్‌సెండ్ చేశారు.

* జీమెయిల్లో అన్‌డు (Undo) సమయం ఎలా మార్చాలి..

జీమెయిల్‌లో మెయిల్ వెనక్కి తీసుకునే టైమ్ మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. అందుకు మీ జీమెయిల్ ఇన్‌బాక్స్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌కు వెళ్లాలి. కుడివైపు పైన సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, "సీ ఆల్ సెట్టింగ్స్" ఆప్షన్ ఎంచుకోవాలి. "జనరల్" ట్యాబ్‌లో "అన్‌డు సెండ్" అనే సెక్షన్ కనిపిస్తుంది.

అక్కడ "సెండ్ కాన్సలేషన్ పీరియడ్:" అని ఉంటుంది. దాని పక్కన డ్రాప్‌డౌన్ బాక్స్ ఉంటుంది. అందులో మీకు ఎంత టైమ్ కావాలో ఎంచుకోండి. 5, 10, 20, లేదా 30 సెకన్లు ఆప్షన్స్ ఉంటాయి. జీమెయిల్ సెట్టింగ్స్‌లో అన్‌డు సెండ్ ఆప్షన్ దగ్గర టైమ్ మార్చుకుంటే, 30 సెకన్ల వరకు మెయిల్ వెనక్కి తీసుకోవచ్చు. ఎలా చేయాలో స్టెప్స్ చూడండి.

స్టెప్ 1: మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉపయోగించి జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. కుడివైపు పైన సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేసి, "సీ ఆల్ సెట్టింగ్స్" ఎంచుకోండి. "జనరల్" ట్యాబ్‌లో, కిందికి స్క్రోల్ చేస్తే "అన్‌డు సెండ్" సెక్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 2: "సెండ్ కాన్సలేషన్ పీరియడ్" ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన డ్రాప్‌డౌన్ బాక్స్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, 5, 10, 20, లేదా 30 సెకన్లు ఇలా మీకు ఎంత సమయం కావాలో ఎన్నుకోవాలి.. నిపుణులు ఏం చెప్తున్నారంటే, 30 సెకన్లు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే, ఒక్కోసారి పొరపాటు జరిగాక కాస్త లేటుగా గుర్తొస్తుంది. జాగ్రత్తగా ఉండటం ఎప్పుడూ మంచిదే.

More from GizBot

Best Mobiles in India

English summary
Gmail's Undo Send feature lets you recall emails after sending, preventing mistakes. Easily unsend on desktop and mobile in a few steps. Customize the undo time in settings for more flexibility.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X