మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

Written By:

స్నాప్‌డీల్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు దూసుకెళుతోంది. కంపెనీ నష్టాలను వీలయినంతగా పూడ్చుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా లీజుకు తీసుకున్న కార్యాలయాలను మూసివేయాలనే గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన నగరాల్లోని కార్యాలయాలను పూర్తిగా మూసివేసి సంస్థ నష్టాలను తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల్లో కోత విధించడం ద్వారా ఇంకా నష్టాలను తగ్గించుకోవచ్చని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది.స్నాప్‌డీల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఇప్పుడు మరింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి దాపురించింది. అసలు స్నాప్‌డీల్ పరిస్థితి ఏంటీ ..నష్టాల బాటలో ఎందుకు నడుస్తోంది. పూర్తిగా విశ్లేషిద్దాం.

Read more: మళ్లీ పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

Read more : 600 మంది ఉద్యోగులపై స్నాప్‌డీల్ వేటు : పీకే మహత్యమేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముంబై , హైదరాబాద్, కోలకత్తా లాంటి ప్రాంతీయ కార్యాలయాలు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఈ మార్కెట్ దిగ్గజం స్నాప్‌డీల్ ఇప్పుడు మూసివేత బాటలో నడుస్తోంది. వీలయినంతవరకు తన కార్యాలయాలను తగ్గించుకునే పనిలో పడింది. ప్రధానంగా ముంబై , హైదరాబాద్, కోలకత్తా లాంటి ప్రాంతీయ కార్యాలయాలు మూసివేత దిశగా పయనించే అవకాశం ఉందని స్నాప్‌డీల్ ప్రతినిధులు చెబుతున్నారు.

టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఇప్పటికే బెంగుళూరులోని అకౌంట్స్ అండ్ మేనేజ్ మెంట్ కు చెందిన టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది కూడా. ఇక ఫిబ్రవరిలో పనితీరు బాగాలేదని 200 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఆఫీసుల మూసివేత వచ్చే ఆరునెలల్లో జరగవచ్చని స్నాప్‌డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కంపెనీ ఇచ్చే డిమాండ్‌లను చేరుకోవడం చాలా కష్టమని

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

అయితే కంపెనీ ఇచ్చే డిమాండ్‌లను చేరుకోవడం చాలా కష్టమని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొందమంది ఉద్యోగులైతే తమతో రాజీనామా చేయించొద్దని ఢిల్లీకి వెళ్లి మరీ కంపెనీ అధినేతలతో చర్చించారు. అయితే ప్రధానంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద ఈ కామర్స్ దిగ్గజాలతో పోటీని తట్టుకోలేక కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యాడ్ బిజినెస్ ల వైపు ప్రధానంగా దృష్టి

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

అంతే కాకుండా కంపెనీ యాడ్ బిజినెస్ ల వైపు ప్రధానంగా దృష్టి సారిస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే ఈ విషయంపై స్నాప్‌డీల్ నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మూసివేత దిశగా ఉన్న ఆఫీసు ఉద్యోగులను కంపెనీ క్యాంపస్ ఉన్న గుర్గావ్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఎవరైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ప్రకారం అన్ని చెల్లింపులను అందుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే స్నాప్ డీల్ పతనానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఆమిర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనతో అనుబంధమున్న స్నాప్‌డీల్, గోద్రెజ్ సంస్థలకు అనేక కష్టాలు తెచ్చిపెట్టాయి.

స్నాప్‌డీల్‌పై నెటిజన్లు నిప్పులు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఆమిర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ సైటు స్నాప్‌డీల్‌కే ఈ సెగ అప్పుడు ఎక్కువగా తాకింది. ఆమిర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు ఆయనపై నిప్పులు చెరుగుతూ పనిలో పనిగా స్నాప్‌డీల్‌పైనా విరుచుకుపడ్డారు. దీంతో స్నాప్ డీల్ ఒక్కసారిగా కుదేలైంది.

ఆమిర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించే దాకా

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఆమిర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించే దాకా కంపెనీ నుంచి కొనుగోళ్లు చేసే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అంతే కాదు అప్పటికప్పుడు యాప్ వాపసీ నినాదం రూపొందించి.. స్నాప్‌డీల్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో అమీర్ ను స్నాప్ డీల్ తొలగించక తప్పలేదు.

85,000 మంది పైచిలుకు యూజర్లు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఒకానొక దశలో దాదాపు 85,000 మంది పైచిలుకు యూజర్లు స్నాప్‌డీల్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసేసినట్లు అంచనా. పనిలో పనిగా గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ రేటింగ్‌లను కూడా తగ్గించేశారు.

కంపెనీ రేటింగ్ ను కూడా భారీగా

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

అప్పట్లో కంపెనీ రేటింగ్ ను కూడా భారీగా తగ్గించారు. గూగుల్ ప్లే స్టోర్ లో కంపెనీ యాప్‌కు కేవలం 1 స్టార్ రేటింగ్ (గరిష్టం 5 స్టార్లు) ఇచ్చారు. దీంతో స్నాప్ డీల్ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు సమాచారం.

పెట్టుబడులను ఆకర్షించడంలో

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా స్నాప్‌డీల్ వెనుకబడిపోయింది. అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డులను ఫ్లిప్ కార్ట్ తో కలిసి, పెట్టుబడుల కోసం అభ్యర్థించింది. కానీ వారెవరూ పెట్టుబడి పెట్టడానికి సమ్మతంగా లేమన్నట్టు తెలిసింది.

కొత్త పెట్టుబడుల సంగతి అటుంచితే

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

అమెజాన్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పోటీని తట్టుకొని, వాటి బిజినెస్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా స్నాప్‌డీల్ కొత్త పెట్టుబడులను రాబట్టుకోక తప్పదు. అయితే కొత్త పెట్టుబడుల సంగతి అటుంచితే ఉన్న ఖర్చులు తగ్గించుకుంటే చాలనే అభిప్రాయంలో స్నాప్‌డీల్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఈ-కామర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలపై కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా ఈ స్టార్టప్ కంపెనీలకు అడ్డంకిగా మారాయి. ఈ నిబంధనలపై ఈ సంస్థలకు అవగాహన తక్కువగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నాయి. అందుకే కొన్ని కేసుల్లో కూడా చిక్కుకుని విలవిలలాడాయి.

ఆన్‌లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఆన్‌లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా కంపెనీ ఆదాయాలు దారుణంగా పడిపోయనట్లుగా తెలుస్తోంది.

అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్లను

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఇప్పటివరకూ కంపెనీలు అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్లను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక గతేడాది దీపావళి సీజన్‌లో తక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. దీంతో కంపెనీ నష్టాల ఊబిలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.

స్నాప్‌డీల్‌ నుంచి అనుభవమున్న ఉద్యోగులు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఇక స్నాప్‌డీల్‌ నుంచి అనుభవమున్న ఉద్యోగులు ఒక్కొక్కరుగా సంస్థను వీడటంతో దాని ప్రభావం కూడా సంస్థపై పడినట్లుగా తెలుస్తోంది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన శ్రీనివాస్, సంస్థ స్ట్రాటజీ విభాగం హెడ్ రంజన్ కాంత్ లు ఆ సంస్థను వదిలి వెళ్లడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది కూడా.

ఇంకా అనేక కారణాలు

మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

ఇంకా అనేక కారణాలు సంస్థ మార్కెంటిగ్ రేటును తగ్గించాయి. వెరసి కంపెనీ వీలైనంతగా నష్టాలను పూడ్చుకునే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మూసివేద ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


English summary
Here Write Snapdeal plans to scale down operations in regional offices
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot