షాపింగ్ మాల్‌లో ‘కిలాడీ కీచకుడు’

Posted By:

కాలి బూటులో స్పై కెమెరాను ఫిట్ చేసుకుని దొంగచాటుగా అమ్మాయిలను అనుసరిస్తూ వారిని అసభ్యకరంగా చిత్రీకరిస్తోన్న 34 ఏళ్ల న్యాయవాదిని దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని పోలీసులు వెల్లడించారు.

Read More : దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి... దక్షిణ ఢిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి మహిళల వెనుక అనుమానస్పదంగా సంచరించటాన్ని మాల్‌లోని ఓ మేనేజర్ గమనించాడు.

ఇతన ప్రవర్తన పై సందేహం కలగటంతో మేనేజర్ ప్రశ్నించే ప్రయత్నం చేయగా సదరు వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించి సెక్యూరిటీ సిబ్బందికి చిక్కాడు. అతడిని పూర్తాగా సోదా చేయగా షూలో దాచి పెట్టిన రహస్య కెమెరా బయటపడింది. ఆ రహస్య కెమెరా ద్వారానే ఇతగాడు అమ్మాయిల అసభ్య ఫోటోలను చిత్రీకరిస్తున్నట్లు సిబ్బంది గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

Read More : ప్రపంచాన్నిషాక్ చేసిన సంచలనాలు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మహిళల అసభ్య ఫోటోలతో కూడిన 12 క్లిప్స్‌ను పోలీసులు గుర్తించారు. ఈ క్లిప్స్‌ను నిందితుడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసాడా..? లేదా..? అన్నది పరిశీలించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.


నిందితుడి పై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టటంతో అతగాడు నేరాన్ని అంగీకరించాడు. తన కుడికాలి బూటులో స్పై కెమెరాను అమర్చినట్టు ఒప్పుకున్నాడు. ఇంటర్నెట్ ద్వారా తనకు ఈ ఐడియా వచ్చిందని ఈ ఆలచనను ఆచరణలో పెట్టే క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా స్పై కెమెరాను కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

మీరు వెళ్లిన ట్రెయిల్ రూమ్ లేదా రీఫ్రెష్ రూమ్‌లో అద్దాలు, పెయింటింగ్స్, పూల మొక్కలు ఇలా అన్ని వస్తువులను నిశితంగా పరిశీలించండి. సీసీకెమెరాలను ఎక్కువుగా ఇలాంటి ప్రదేశాల్లోనే అమరుస్తారు.

రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

సీసీకెమెరా లేదా మైక్రోఫోన్‌లను సీలింగ్స్ అదేవిధంగా లైట్‌లలో అమర్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి వాటి పైనా ఓ కన్నేసి ఉంచండి.

రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

రూమ్‌లో ఏవైనా వైర్లు బయటకు కనిపిస్తున్నాయేమో చూడండి. ఒక వేళ కనిపిస్తూ వాటిని ఎక్కడ అనుసంధానించారో పసిగట్టండి.

 

 

రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

మీరు బస చేసిన గదిలో మైక్రోఫోన్ లేదా సీసీకెమెరా అమర్చినట్లయితే బజర్ శబ్ధాలు వినిపిస్తాయి. కాబట్టి శబ్ధాలను క్షుణ్నంగా ఆలకించండి.

రహస్య కెమెరాల నుంచి తప్పించుకోవటం ఏలా..?

మార్కెట్లోకి కొత్తగా వచ్చిన డిటెక్టర్ మీ వెంట ఉన్నట్లయితే మీ ఉండే కొత్త ప్రదేశంలో ఏఏ సాంకేతిక పరికరాలు ఉన్నాయో ఇట్టే కనిపెట్టవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Spy camera fitted in shoe. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot