Home
News

ఈ ట్రిక్ తెలిస్తే.. ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ చూడొచ్చు!

మార్చి 9న ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దాంతో ఇండియాలో క్రికెట్ ఫీవర్ తారా స్థాయికి చేరుకుంది. హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రసారమవుతుంది అందుకే దాని 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కోసం చాలా మంది రూ.149 ఖర్చు పెట్టడం మొదలెట్టేశారు. కానీ దీనికోసం డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ ఫ్రీగా మ్యాచ్ చూసే వీలుంది.

కొన్ని జియో, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో మీరు ఫ్రీగా హాట్‌స్టార్ యాక్సెస్ పొందొచ్చు. ఈ ప్లాన్స్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఫైనల్ మ్యాచ్ చూసేయొచ్చు. ముందుగా జియో ప్లాన్స్‌తో హాట్‌స్టార్ ఫ్రీగా ఎలా పొందాలో తెలుసుకుందాం. తర్వాత వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ చూద్దాం.

Watch India vs NZ Final Match FREE

* జియో క్రికెట్ డేటా ప్యాక్ (రూ.195)
జియో క్రికెట్ డేటా ప్యాక్ కేవలం రూ.195 కే లభిస్తుంది. ఈ ప్లాన్‌తో 3 నెలల పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. మొత్తం 15GB 4G/5G డేటా 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, SMS సౌకర్యం ఉండదు. అంటే బేస్ ప్లాన్ వేరేది తీసుకోవాల్సి ఉంటుంది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్ (రూ.949)
జియో రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే, మీకు 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 2GB డేటా, రోజుకి 100 SMSలు కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని ప్రయోజనాలతో సింగిల్ ప్యాకేజీ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.

* Vi ప్లాన్స్‌తో హాట్‌స్టార్ ఫ్రీ
Vi యూజర్లు రూ. 151 డేటా ప్యాక్‌తో 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుకోవచ్చు. ఈ ప్యాక్‌లో 4GB డేటా 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఒకవేళ మీకు నెల రోజుల్లోనే డేటా అయిపోతే, అదనంగా డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Vi వినియోగదారులకు మరో ఆకర్షణీయమైన ప్లాన్ రూ.169 డేటా ప్యాక్. ఈ ప్లాన్‌తో కూడా 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా, రూ.151 ప్లాన్‌తో పోలిస్తే రెట్టింపు డేటా, అంటే 8GB డేటాను 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. కాబట్టి, ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక.

Vi రూ.469 ప్రీపెయిడ్ ప్లాన్ ప్లాన్‌తో 3 నెలల హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2.5GB డేటా, రోజుకి 100 SMSలు, రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

* ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..
మీ మొబైల్ ప్రొవైడర్ యాప్, వెబ్‌సైట్ లేదా వేరే ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ ప్లాన్స్‌లో ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో హాట్‌స్టార్‌లో లాగిన్ అవ్వాలి. అంతే, అదనంగా డబ్బులు కట్టకుండానే లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీకు నచ్చిన జియో లేదా Vi ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
STOP Paying for Hotstar, Watch India vs NZ Final Match FREE Hotstar with These Jio Recharge Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X