Tata Sky Binge+ యూజర్లకు బంపర్ ఆఫర్!!! Rs.3999లకే STB ,6నెలల ఫ్రీ సర్వీస్

|

ఇండియాలోని డిటిహెచ్ రంగంలో అధిక వినియోగదారులను కలిగి ఉన్న టాటా స్కై తన వినియోగదారులకు ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. టాటా స్కై బింగే + సెట్-టాప్ బాక్స్ (STB) ను ఇప్పుడు వినియోగదారులకు రూ.3999 ధర వద్ద అందించడమే కాకుండా బింగే యొక్క సేవలను ఆరు నెలలపాటు ఉచితంగా అందిస్తున్నది.

టాటా స్కై బింగే
 

టాటా స్కై బింగే సేవలలో డిస్నీ + హాట్స్టార్, సన్ NXT, హంగమా ప్లే, షెమరూ మి మరియు ఈరోస్ నౌతో సహా అన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లను నెలకు 249 రూపాయల ఒకే ఒక చందా ద్వారా పొందవచ్చు. అదనంగా కొత్త బింగే + కొనుగోలుదారులు అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోకు మూడు నెలల ఉచిత సభ్యత్వాన్ని కూడా స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది.

టాటా స్కై బింగే + తగ్గింపు ధర

టాటా స్కై బింగే + తగ్గింపు ధర

టాటా స్కై బింగే + యొక్క తగ్గింపు ధర ఇప్పటికే ఉన్న కస్టమర్లకు వారి ప్రస్తుత ఎస్‌టిబిని అప్‌గ్రేడ్ చేయడానికి ఎంచుకోవడం లేదా మల్టీ-టివి కనెక్షన్ కోసం బింగే + ఎంచుకోవడం మీద కూడా వర్తిస్తుంది.

టాటా స్కై బింగే + OTT కంటెంట్‌

టాటా స్కై బింగే + OTT కంటెంట్‌

ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే టాటా స్కై బింగే + డివైస్ లైవ్ టీవీ మరియు OTT కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా టాటా స్కై వినియోగదారులు OTT యాప్ లు మరియు లైవ్ టీవీలను కూడా సజావుగా చూడడానికి వీలు కల్పిస్తుంది.అంతేకాకుండా OTT యాప్ లలో ఏడు రోజుల ముందు కంటెంట్‌కు కూడా యాక్సిస్ ను అందిస్తుంది. టాటా స్కై బింగే + ఎస్‌టిబిలో గూగుల్ అసిస్టెంట్ మద్దతు కూడా ఉంది.

టాటా స్కై బింగే + అంతకుముందు ధర
 

టాటా స్కై బింగే + అంతకుముందు ధర

టాటా స్కై బింగే + ఎస్‌టిబిని జనవరిలో కొత్త కస్టమర్లతో పాటు ప్రస్తుత కస్టమర్‌లు తమ ఎస్‌టిబిలను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్న వారందరికి రూ.5999 ధర వద్ద అందించింది. అయితే టాటా స్కై బింగే + ఎస్‌టిబికి అప్‌గ్రేడ్ చేస్తే కస్టమర్లకు రూ .1000 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని కంపెనీ తరువాత ప్రకటించింది.

టాటా స్కై బింగే + Vs డిష్‌ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్‌

టాటా స్కై బింగే + Vs డిష్‌ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్‌

డిష్ టివి, డి 2 హెచ్ మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి కూడా తమ వినియోగదారుల కోసం ఇలాంటి ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఎస్‌టిబిలను అందిస్తాయని గమనించాలి. డిష్ టీవీ తన డిష్‌ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్‌ను రూ.2499 ధరతో తన వినియోగదారులకు ఒక నెల ఉచిత చందాను కూడా అదనంగా అందిస్తుంది. అదేవిధంగా డి 2 హెచ్ తన ఆండ్రాయిడ్ పవర్డ్ డి 2 హెచ్ స్ట్రీమ్ ఎస్‌టిబిని రూ .2499 కు అందిస్తుండగా కొత్త యూజర్లు దీనిని రూ .3999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్

ఎయిర్టెల్ డిజిటల్ టివి తన ఆండ్రాయిడ్ పవర్డ్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కొత్త వినియోగదారులకు 3999 రూపాయల ధర వద్ద అందిస్తుండగా, దాని ఎయిర్‌టెల్ థాంక్స్ సభ్యులు ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను రూ .2249 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. టాటా స్కై దాని ప్రస్తుత వినియోగదారుల కోసం బింగే + ఎస్‌టిబి యొక్క ధరను తగ్గిస్తుందో లేదో చూడాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Binge+ Price Slashed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X