Home
News

Tata Sky Offers: రెండు నెలల సేవలను ఉచితంగా పొందే గొప్ప అవకాశం...

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై 'టాటా స్కై క్యాష్‌బ్యాక్' ఆఫర్ రూపంలో సాధారణ దీర్ఘకాలిక రీఛార్జ్ ఎంపికను ముందు నుంచి అందిస్తోంది. ఈ డిటిహెచ్ ఆపరేటర్ ఇప్పుడు కొత్తగా మరొక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా చందాదారులు 12 నెలల లేదా ఒక సంవత్సర కాలానికి ఒకే సారి రీఛార్జ్ చేసుకుంటే కనుక వారికి అదనంగా రెండు నెలల సేవలను ఉచితంగా అందిస్తోంది.

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్

అయితే ఇందులో గమనించ దగ్గ విషయం ఏమిటంటే సిటీబ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి టాటా స్కై అకౌంటును రీఛార్జ్ చేసే చందాదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండగా ఈ కొత్త ఆఫర్ మాత్రం సిటీబ్యాంక్ కార్డు వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడింది. టాటా స్కై మొబైల్ యాప్ మరియు వెబ్‌సైట్ రెండింటి ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ మొత్తం రీఛార్జ్ చేసిన తేదీ నుండి ఏడు రోజుల్లో జమ అవుతుంది. ప్రస్తుతం ఏ డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లోనైనా అందుబాటులో ఉన్న ఉత్తమ దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌లలో ఇది ఒకటి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సిటీబ్యాంక్ వినియోగదారుల కోసం టాటా స్కై కొత్త రీఛార్జ్ ఆఫర్‌

సిటీబ్యాంక్ వినియోగదారుల కోసం టాటా స్కై కొత్త రీఛార్జ్ ఆఫర్‌

టాటా స్కై 2019 మధ్యకాలం నుండి ‘క్యాష్‌బ్యాక్' ఆఫర్‌ను అందిస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న వినియోగదారుకు అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా ఒక నెల అదనపు సేవలను పొందటానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు ప్రముఖ డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై కేవలం సిటీబ్యాంక్ వినియోగదారులకు ప్రత్యేకమైన కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చారు. ప్రస్తుత టాటా స్కై వినియోగదారులు టాటా స్కై యొక్క వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ లలో సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను (సిటీబ్యాంక్ కార్పొరేట్ కార్డులు మినహా) ఉపయోగించి వారి నెలవారీ రీఛార్జ్ విలువకు 12 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో వారి అకౌంటును రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

టాటా స్కై అకౌంటు రీఛార్జ్

టాటా స్కై అకౌంటు రీఛార్జ్

టాటా స్కై అకౌంటును రీఛార్జ్ చేసిన తరువాత క్యాష్‌బ్యాక్ మొత్తం ఏడు రోజులలో వినియోగదారుడి అకౌంటులో జమ అవుతుంది. టాటా స్కై యొక్క ఒక నెల క్యాష్‌బ్యాక్ 48 గంటల్లో జమ అవుతుంది. అలాగే మరో నెల క్యాష్‌బ్యాక్ ఏడు రోజుల్లో జమ అవుతుంది అని సంస్థ ధృవీకరించింది. ఈ ఆఫర్ జూన్ 30, 2020 వరకు మాత్రమే లభిస్తుంది. అది కూడా ఈ నెలలో సిటీబ్యాంక్ కార్డు వినియోగదారులకు మాత్రమే.

లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్

లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్

12 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేయడం నచ్చని వారికి తక్కువ మొత్తంలో నెల వారి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 200 రూపాయల నుంచి చాలా ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన చందాదారులు వార్షిక రీఛార్జికి అవసరమైన వాస్తవ మొత్తంతో పాప్-అప్ చూపబడతారు. టాటా స్కై యూజర్లు అసలు వార్షిక రీఛార్జ్ మొత్తాన్ని ఎన్నుకోవచ్చు మరియు సిటీబ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో రీఛార్జికి వెళ్లవచ్చు.

ఆఫర్ నిబంధనలు

ఆఫర్ నిబంధనలు

ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. ఇప్పటికే దీర్ఘకాలిక ఛానల్ ప్యాక్‌లో ఉన్న టాటా స్కై చందాదారులు కొత్త సిటీబ్యాంక్ ఆఫర్‌కు అర్హులు కాదు. అలాగే టాటా స్కై యొక్క ప్రస్తుత వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. టాటా స్కై అకౌంట్ యాక్టీవ్ అయిన రోజున చేసిన రీఛార్జీలు పరిగణించబడవని ఆపరేటర్ చెప్పారు.

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ వివరాలు

టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ వివరాలు

సిటీబ్యాంక్ వినియోగదారుల కోసం కొత్త రెండు నెలల రీఛార్జ్ ఆఫర్‌తో పాటు టాటా స్కై ‘టాటా స్కై క్యాష్‌బ్యాక్' అనే దీర్ఘకాలిక రీఛార్జ్ ఆఫర్‌ను ప్రస్తుతం అందిస్తున్నది. ఈ ఆఫర్ కింద వినియోగదారులకు వార్షిక రీఛార్జిలో 30 రోజులు లేదా ఒక నెల ఉచిత సర్వీస్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ మొత్తం రీఛార్జ్ సమయం నుండి 48 గంటల్లో జమ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Offers 2 Months Free Service on Annual Recharge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X