Tata Sky బ్రాడ్‌బ్యాండ్ 1Gbps స్పీడ్ కొత్త ప్లాన్ ధరలు, ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి
ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో దీని వినియోగం మరింత ఎక్కువ అయింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో (ISP) ఒకటైన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు 1Gbps స్పీడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ సర్వీస్ ప్రొవైడర్ తన ప్లాన్‌లలో గరిష్టంగా 300 Mbps వేగంతో మాత్రమే అందించేది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన పోర్టుఫోలియోలోకి కొత్తగా 1Gbps ప్లాన్‌ను కూడా చేర్చింది. అయితే ఈ ప్లాన్ కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు దీనిని విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. 1Gbps ప్లాన్ ప్రస్తుతం వాఘోలి (పూణే శివారు) లో మాత్రమే అందించబడుతుంది. టాటా స్కై యొక్క ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగా అనేక ప్రయోజనాలతో లభించే ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1Gbps ప్లాన్ వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ పోర్టుఫోలియోలో కొత్తగా చేరిన 1Gbps ప్లాన్ వినియోగదారులకు అపరిమిత డేటాను అందిస్తోంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ విషయంలో అపరిమిత డేటా అంటే నెలకు 3.3TB లేదా 3,300GB డేటా అని గుర్తుంచుకోవాలి. ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటా వినియోగం తరువాత వినియోగదారులు 3Mbps వేగంతో బ్రౌజింగ్ ను కొనసాగించవచ్చు. ఈ ప్లాన్‌తో అందించే డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం రెండూ 1Gbps తో ఏకరీతిగా ఉంటాయి.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1Gbps ప్లాన్ ధరల వివరాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ 1Gbps కొత్త ప్లాన్‌ను 3, 6 మరియు 12 నెలలు వంటి మూడు వేర్వేరు చెల్లుబాటు ఎంపికలలో అందిస్తోంది. వినియోగదారులకు 3 నెలల వాలిడిటీ కాలానికి రూ.14,160, 6నెలల వాలిడిటీ కాలానికి రూ.26,196 మరియు చివరిగా 12 నెలల చెల్లుబాటు కాలానికి రూ.48,144 చెల్లించి పొందవచ్చు. ఈ ధరలు అన్ని కూడా GSTతో సహా ఉన్నాయని గమనించండి. 3 నెలల ఎంపికలలో వినియోగదారులు నెలకు రూ.4,720, 6 నెలల ఎంపికలలో నెలకు 4,366 రూపాయలు, చివరగా 12 నెలల ఎంపికలలో నెలకు రూ.4,012 ధర వద్ద పొందవచ్చు.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1Gbps ప్లాన్ ఉచిత ప్రయోజనాలు
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ఈ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ఉచిత ఇన్‌స్టాలేషన్ సేవలు, ఉచిత వై-ఫై రౌటర్ మరియు నిల్ సెక్యూరిటీ డిపాజిట్ వంటి సేవలను అందిస్తుంది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ 1Gbps ప్లాన్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు వినియోగదారులకు 50 Mbps నుండి 300 Mbps వరకు ప్లాన్‌లను అందించేది. టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ యొక్క ఈ ప్లాన్‌తో యూజర్లు ల్యాండ్‌లైన్ సర్వీసును కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క ధర ఖచ్చితంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ వంటి ఇతర ISP లకు గట్టి పోటీని ఇస్తుంది.

టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ OTT ప్రయోజనాలు
టాటా స్కై యొక్క బ్రాడ్‌బ్యాండ్ సమర్పణల నుండి ఇప్పటికీ ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు అందుబాటులో లేవు. ఇతర ISP లు తమ వినియోగదారులకు OTT ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నాయి. కావున టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కంటే ఇతర ISPలు ఒక అడుగు ముందుగానే ఉన్నాయి. టాటా స్కై తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో OTT ప్రయోజనాలను అందించడం ప్రారంభిస్తే కనుక భారతదేశంలోని ఉత్తమ ISP లలో ఒకటి అవుతుంది.


Click it and Unblock the Notifications








